డీలిమిటేషన్ బిల్లులకు ఫుల్ మెజార్టీ- బీజేపీ అంచనా ఇదే- ఎక్స్ ట్రా 11 ఓట్లు..!
కేంద్ర ప్రభుత్వం రేపు పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్న డీలిమిటేషన్, మహిళా బిల్లు తో పాటు మొత్తం 3 బిల్లుల ద్వారా రాజ్యాంగ సవరణ కోసం 2/3 వంతు మెజార్టీని లోక్ సభతో పాటు రాజ్యసభలోనూ సాధించాల్సి ఉంటుంది. అయితే పెద్దల సభ అయిన రాజ్యసభలో ఇప్పటికే 2/3 మెజార్టీ సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే.. ఇప్పుడు లోక్ సభలోనూ ఆ మెజార్టీ మార్కును అందుకున్నట్లే కనిపిస్తోంది. ఈ మేరకు బీజేపీ వర్గాలు తమ తాజా అంచనాను వెల్లడించాయి.
కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టబోయే డీలిమిటేషన్ బిల్లులకు (Delimitation Bill) 2/3 వంతు మెజార్టీ అంటే 360 ఓట్ల మెజార్టీ అవసరం ఉంటుంది. ప్రస్తుతం లోక్ సభలో అందుబాటులో ఉన్న 540 మంది ఎంపీలు ఓటేస్తారనుకుంటే ఇందులో 2/3 వంతు లెక్కిస్తే 360 ఓట్లు అవుతాయి. ఇందులో ప్రస్తుతం అధికార ఎన్డీయే కూటమితో పాటు విపక్షాలు, ఇతర పార్టీలు, స్వతంత్ర ఎంపీల నుంచి అందుతున్న మద్దతు మొత్తం కలుపుకుంటే 371 సీట్ల వరకూ ఉందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అంటే మెజార్టీకి అవసరమైన 360 ఓట్ల మార్కు కంటే మరో 11 ఓట్లు ఎక్కువగానే ఉన్నాయన్న మాట.

ఇప్పటివరకూ డీలిమిటేషన్ బిల్లులకు మద్దతుగా ఉన్న, మద్దతు ప్రకటించిన పార్టీల ఎంపీల సంఖ్య చూసుకుంటే ఎన్డీయే కూటమిలోనే 320 మంది ఎంపీలున్నారు. వీరికి అదనంగా డీఎంకే 22 మంది ఎంపీలు, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం 8 ఎంపీలు, వైఎస్సార్సీపీ నలుగురు ఎంపీలు, ఆర్జేడీ రెబెల్స్ ఇద్దరు, యూపీపీఎల్ ఒక ఎంపీ, జడ్పీఎం ఓ ఎంపీ ఉన్నారు. వీరితో కలుపుకుంటే 358 ఎంపీలు అవుతున్నారు. అలాగే తృణమూల్ రెబెల్స్ 20 మంది కూడా కలుపుకుంటే 378 వరకూ ఈ సంఖ్య చేరబోతోంది. ఇలా ఏ విధంగా చూసినా ఈ బిల్లుల్ని ఎన్డీయే నెగ్గించుకోవడం ఈసారి అసాధ్యం కాకపోవచ్చని అంచనా.













Click it and Unblock the Notifications
