రెండో రోజే ఎత్తేశారుగా.. ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప హిట్ కాదన్నా..!!
టాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హిట్స్ ప్లాఫ్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలతో అలరించారు శర్వానంద్. సంక్రాంతి కానుకగా నారీ నారీ నడుమ మురారి చిత్రంతో ఈ ఏడాది తొలి హిట్ అందుకున్నారు శర్వానంద్. ఆ తర్వాత వేసవిలో బైకర్ మూవీతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా వరుసగా రెండు హిట్స్ తో అలరించిన శర్వానంద్.. ఇటీవల భోగి అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చారు.
సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా.. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మించారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో భారీ అంచనాల మధ్య ఈ మూవీ రిలీజ్ అయింది. అంతకుముందు వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను క్రియేట్ చేసింది. అయితే భోగి మూవీకి తొలి రోజు నుంచే పేలవమైన కలెక్షన్స్ దక్కాయి. నెగెటివ్ టాక్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ మూవీ విఫలమైందనే చెప్పాలి.

భోగి చిత్రానికి తొలి రోజు రూ. 2.18 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక రెండో రోజు ఈ మూవీ రూ.1.53 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. అటు ఓవర్సీస్ లోనూ ఈ మూవీకి నిరాశే ఎదురైంది. భోగి మూవీ అక్కడ రూ.35 లక్షలు రాబట్టింది. ఇక ఈ చిత్రానికి రెండు రోజుల్లో రూ. 4 కోట్లకు పైగా కలెక్షన్స్ దక్కాయి. మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు వసూల్లు తగ్గిపోవడంతో సినిమా గట్టెక్కే పరిస్థితులు కనిపించడం లేదు. ఏదైనా మ్యాజిక్ జరిగితే కానీ ఈ మూవీ హిట్ అయ్యే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఈ మూవీ రానున్న రోజుల్లో మరి ప్రేక్షకులను అలరిస్తుందో.. లేదో చూడాలి.












Click it and Unblock the Notifications
