తెలంగాణ కథలో హీరో కేసీఆర్... విలన్ కాంగ్రెస్ పార్టీ.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
దీక్షా దివస్ సందర్భంగా కరీంనగర్ జిల్లా అలుగనూరులో జరిగిన సభలో కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. 500 రోజుల్లో మళ్లీ కేసీఆర్ పాలన వస్తుందని అందుకు సంబంధించిన కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని కేటీఆర్ స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక పోలీసులు డ్యూటీ చేయాలని కానీ అతి చేయకండని తెలిపారు. అతి ఎవరు చేసినా వదలిపెట్టమని.. అతి చేసిన ఎవరైనా సరే సప్త సముద్రాల అవతల దాక్కున్నా పట్టుకొస్తామని స్పష్టం చేశారు.
అన్నమో రామచంద్ర అని అలమటించిన తెలంగాణను ఎన్నో ప్రాజెక్టులు కట్టి అన్నపూర్ణగా చేసిన వ్యక్తి కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. ఇక కరోనా కంటే డేంజర్ గా కాంగ్రెస్ మారిందని విమర్శించారు. ఈ మూడేండ్ల కాలంలో కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఒక్క మాట అనలేదని.. అయినా కూడా రేవంత్ రెడ్డి మాత్రం ప్రతి మీటింగ్ లో కేసీఆర్ పేరును కోటి సార్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అయితే కేసీఆర్ మాట్లాడినా సంచలనమే.. కేసీఆర్ మాట్లాడకపోయినా అది కూడా సంచలనమేనని తెలిపారు. ఇక పక్క రాష్ట్రం నీళ్లను తరలిస్తుంటే పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలన ఉంటే ఇలా జరిగేనా అంటూ నిలదీశారు.

ఇక సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని స్పష్టం చేశారు. మూడు తరాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేసిన కేసీఆర్ బ్రెయిన్ డెడ్ అవుతారని ఆనాడు వైద్యులు చెప్పారని గుర్తు చేశారు. అయితే ఎవరెన్ని చెప్పినా వినకుండా కేసీఆర్ మొండి పట్టుదలతో దీక్ష కొనసాగించారని కొనియాడారు. రాష్ట్రంలో జరిగిన మహా ఉద్యమంతో కేంద్రం దిగివచ్చిందని తెలిపారు.












Click it and Unblock the Notifications
