850 సీట్లతో దేశానికే ముప్పు.. స్టాలిన్‌తో భేటీపై రాహుల్ గాంధీ సెన్సేషనల్ కామెంట్స్!
డీలిమిటేషన్ పేరుతో పార్లమెంటును 850 సీట్లకు విస్తరించి దేశంలోని నియోజకవర్గాల స్వరూపాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం ఇండియాకే కాకుండా ముఖ్యంగా దక్షిణాదికి, తమిళనాడుకు తీవ్ర నష్టం కలిగించేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో జరిగిన సమావేశంలో ఈ అంశాలను వివరించామని వెల్లడించారు.
స్టాలిన్‌తో తమ సమావేశం ఎంతో ఆహ్లాదకరంగా, సామరస్యంగా జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. లోక్‌సభ సీట్లను 850కి పెంచి ఆ అవకాశాన్ని అడ్డం పెట్టుకుని నియోజకవర్గాల స్వరూపాన్ని పూర్తిగా మార్చాలన్నదే బీజేపీ ప్రధాన ఎజెండా అని ఆయన ఆరోపించారు.

అసోం, జమ్మూకశ్మీర్‌లో ప్రయోగం
నియోజకవర్గాల పునర్విభజన ద్వారా తమకు అనుకూలంగా మార్చుకునే ఆలోచనను బీజేపీ ఇప్పటికే అసోం, జమ్మూకశ్మీర్‌లో పరీక్షించిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇప్పుడు దానిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తోందని విమర్శించారు. అందుకే బీజేపీ కుట్ర నెరవేరకుండా చూడాలని.. తమిళనాడు ప్రయోజనాలను కాపాడాలని సోదరుడు స్టాలిన్‌ను కోరినట్లు వెల్లడించారు. 850 సీట్లతో బీజేపీ నియోజకవర్గాల స్వరూపాన్ని మార్చేస్తే దేశంలో ప్రజాస్వామ్యం అంతమైపోతుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. తమిళ సంస్కృతి, తమిళ భాషపై పూర్తిస్థాయి దాడి మొదలవుతుందని.. తాను చెబుతున్న ఆ మాటలను గుర్తుంచుకోవాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఎంకే స్టాలిన్ మీతో ఏమన్నారని జర్నలిస్టులు ప్రశ్నించగా.. తాము తమ అభిప్రాయాలను చెప్పామని, ఆయన ఏమన్నారో చెప్పడానికి తాము ఇక్కడ లేమని రాహుల్ గాంధీ బదులిచ్చారు. చివరి ప్రయత్నంగా పలువురు విపక్ష నేతలతో కలిసి కాంగ్రెస్ స్టాలిన్‌ను కలిసినా.. డీఎంకే మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రభుత్వానికే మద్దతు ఇస్తామని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
విపక్ష దిగ్గజ నేతల భేటీ
ఎంకె స్టాలిన్ తో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మమతా బెనర్జీ, మల్లికార్జున ఖర్గే, కపిల్ సిబల్, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. సమావేశం సందర్భంగా స్టాలిన్, రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకున్నప్పటికీ.. రాజకీయంగా మాత్రం సయోధ్య కుదరలేదు. ఇండియా కూటమి నేతలు, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మధ్య సుమారు 70 నిమిషాల పాటు చర్చ జరిగింది. రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు స్టాలిన్‌ను ఒప్పించేందుకు గట్టిగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆర్ఎస్ఎస్ నుంచి ప్రజాస్వామ్యం వరకు పలు అంశాలను ప్రస్తావించినా స్టాలిన్ తన వైఖరిని మార్చుకోలేదని సమాచారం.
డీఎంకే వైఖరి ఇదే..
తమ డిమాండ్ల మేరకు ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లులో సవరణలు చేసిందని.. అందుకే మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యామని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా మరో 25 ఏళ్ల పాటు రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని యథాతథంగా ఉంచాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడం మినహా తమకు మరో మార్గం లేదని.. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి తమ ముందు వేరే ప్రత్యామ్నాయాన్ని ఉంచలేదని స్టాలిన్ స్పష్టం చేశారు.
Rahul Gandhi: "We had a very nice, cordial meeting with Thiru Stalin ji. We explained our view to him that an 850-seat Parliament with delimitation, and allowing the BJP to completely shape those 850 seats and change the nature of constituencies in India, is not only damaging to the Indian nation, it is damaging to South India and particularly to Tamil Nadu. We mentioned to him that the key issue here is the expansion of the Lok Sabha to 850 seats and the fact that the BJP wants to use the space provided by that expansion to completely change the nature of India's constituencies. They have already tested this idea in Assam and in J&K, and they want to implement it across the whole of India. That is why we requested brother Stalin to defend Tamil Nadu and ensure that this design of the BJP is not allowed to happen. Remember what I'm saying, once the BJP reshapes India's constituencies with 850 seats, democracy in India is finished, and a full-scale attack on Tamil culture and the Tamil language will begin." https://t.co/PweYtuvSzQ
— Hemant Rajaura (@hemantrajora_) November 29, 2026













Click it and Unblock the Notifications
