ఉదయం ఐటీ జాబ్.. రాత్రి అయితే గంజాయి దందా.. వీళ్లు మామూలోళ్లు కాదు భయ్యో..!

ఆ యువకుడు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్‌ గా పనిచేస్తున్నాడు. రూ. లక్షల్లో ప్యాకేజీ.. కానీ వీటితో పాటు రాత్రి అయితే గంజాయి దందా కూడా చేస్తాడు. అలా ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ నడుపుతున్న ఒక 27 ఏళ్ల యువకుడిని తెలంగాణ ఈగల్ ఫోర్స్ బృందాలు తాజాగా అరెస్ట్ చేశాయి.

ఈ ముఠాలో భాగమైన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మెడ్చల్‌ లోని పద్మావతి హోమ్స్‌ లో నివాసం ఉంటున్న ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి సుమారు రూ. 4.5 లక్షల విలువైన 9 కిలోల గంజాయితో పాటు 3 సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇక పోలీసుల విచారణలో వీరి దందాకు సంబంధించిన కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న షబీబ్ అనే ప్రధాన సప్లయర్ వద్ద నుంచి గంజాయిని ఈ ముఠా తక్కువ ధరకు అంటే కేజీ రూ. 37 వేలకు కొనుగోలు చేసి హైదరాబాద్‌ కు తరలిస్తున్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లేటప్పుడు విమానంలో వెళ్లి.. గంజాయితో వచ్చేటప్పుడు అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్ రైలులో రెండు బ్యాగుల్లో తరలించినట్లు గుర్తించారు.

Hyderabad police arrested three people who was involved in the ganja trade while working his job

ఇక హైదరాబాద్ లో ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్ గా చేసి ఒక్కో ప్యాకెట్లో సుమారు 10 గ్రాముల గంజాయిని ప్యాక్ చేసి.. రూ. 500 నుంచి రూ. 700 వరకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అలాగే ఈ ముఠా నుంచి గంజాయి కొనుగోలు చేసిన 9 మంది వినియోగదారులనూ పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామన్నారు. ఇక ఇప్పటికే అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితుల బ్యాంకు లావాదేవీలు, వాట్సప్ చాటింగ్‌ లతోపాటు మొబైల్ డేటా ఆధారంగా ఈ నెట్‌ వర్క్ మూలాలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+