ప్రశాంతంగా ముగిసిన ఎస్సై ప్రిలిమ్స్.. ఆ జిల్లా నుంచి అత్యధికంగా హాజరు..

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 335 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 90.44 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 1 లక్షా 60 వేల 712 మంది అభ్యర్థులు హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. అయితే వారిలో 1 లక్షా 45 వేల 342 మంది అంటే 90.44 శాతం మంది హాజరైనట్లు బోర్డు ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.

ఇక రాష్ట్రంలోనే అత్యధికంగా కరీంనగర్ రీజినల్ సెంటర్ పరిధిలో 92.69 శాతం హాజరు నమోదు అయింది. అలాగే హన్మకొండలో 92.25 శాతం మందితో రెండో స్థానంలో ఉంది. ఇక 92.17 శాతం మందితో నల్గొండ మూడో స్థానంలో ఉంది. మరోవైపు అత్యల్పంగా మేడ్చల్-మల్కాజిగిరి రీజియన్‌ లో 88.25 శాతం మంది హాజరయ్యారు. ఇక నియామక ప్రక్రియను మరింతగా సులభతరం చేసేందుకు ఈ పరీక్షలో తొలిసారిగా 'ఆధార్ ఫేషియల్ అథెంటికేషన్' విధానాన్ని విజయవంతంగా అమలు చేశారు.

Telangana SI preliminary exam concludes peacefully how many candidates appeared full details here

అలాగే అభ్యర్థుల నుంచి డిజిటల్ ఫింగర్ ప్రింట్స్, డిజిటల్ ఫొటోలను సేకరిస్తూ బయోమెట్రిక్ హాజరును కూడా తీసుకున్నారు. ఇక ఈ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ త్వరలోనే అధికారిక వెబ్ సైట్ అయిన www.tgprb.in లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు అభ్యర్థులు హోమ్ పేజీని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+