Shame on you: బరస్ట్ అయిన రేణు దేశాయ్..!!
టాలీవుడ్ నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుంచి విడిపోయిన అనంతరం తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె. ఇక చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న రేణూ దేశాయ్ ఇటీవల ధనుష్ నటించిన ఓం చిత్రంలో చిన్న పాత్రలో నటించి మెప్పించారు. ఇక తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడంలో ముందుంటారు. ఆమె సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా వెంటనే కామెంట్లు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రేణూ దేశాయ్ కుమార్తె పై సోషల్ మీడియాలో ఓ మహిళా యూజర్ అసభ్యకరంగా కామెంట్ పెట్టడంపై ఆమె ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు.

" ప్లీజ్ ఇలాంటి బూతులు మాట్లాడకండి. మనకు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నంత మాత్రాన బూతులు మాట్లాడాలని కాదు. కొంచెం మీ అమ్మానాన్నా.. మీ పెంపకం గురించి ఆలోచన చేయండి" అని ఇన్ స్టా పోస్టులో రాసుకొచ్చారు. తన 16 ఏళ్ల కుమార్తెను ఓ మహిళా యూజర్ పంది పిల్ల అని కామెంట్ చేయడంపై ఆమె ఒకింత ఎమోషనల్ గా మాట్లాడుతూనే.. మరోవైపు ఫైర్ అయ్యారు. ఒక హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే అమ్మాయి ఇలానా మాట్లాడేది.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లు మన సమాజంలో ఉండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. తనను మెంటల్లీ డిజేబుల్డ్ అని సర్టిఫై చేయడంపైనా రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు.
ఓ చదువుకున్న వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది అని అన్నారు. చదువులేని వాళ్లు ఇలా మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు.. కానీ హెచ్ ఆర్ పొజిషన్ లో ఉన్నవాళ్లు ఇలా మాట్లాడటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము సెలబ్రిటీస్ అయితే మీరు ఎలా మాట్లాడినా భరించాలా..? అని ఫైర్ అయ్యారు. మేము రోబోలం కాదని అన్నారు. ప్రస్తుతం ఆమె తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications
