అంతర్జాతీయ వేదికపై అన్నమయ్య కీర్తన 'బ్రహ్మమొక్కటే'.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
తెలుగు పాటలకు, మన భక్తి కీర్తనలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తే ఆ అనుభూతి మరో విధంగా ఉంటుంది. ఇక అన్నమయ్య రచించిన అద్భుతమైన సంకీర్తనల్లో 'బ్రహ్మమొక్కటే' ఒకటి. అయితే తాజాగా స్విట్జర్లాండ్ లో అంతర్జాతీయ సంగీత వేదికపై ఈ పాట మార్మోగింది. ప్రముఖ అమెరికన్ మ్యూజిక్ గ్రూప్ ఈ కీర్తనను ఆలపించడంతో ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తాజాగా స్విట్జర్లాండ్ లో నిర్వహించిన సాల్జ్ బర్గ్ ఫెస్టివల్ 2026 లో ఈ అద్భుతమైన ప్రదర్శన జరిగింది.
What a wonderful performance!It is heartening to see Chanticleer, the Grammy-winning American a cappella choir, perform ‘Brahmam Okkate’, the iconic 15th-century keerthanam composed by Sri Tallapaka Annamacharya, at the Solsberg Festival 2026 in Switzerland.The performance has captured the attention of audiences worldwide, carrying a profound message of equality, humanity and the oneness of all beings.This timeless composition reminds us of the richness of Telugu culture and heritage, which transcends borders, languages and generations!https://t.co/ti7XiEY1q2
— N Chandrababu Naidu (@ncbn) November 28, 2026
అమెరికాలోని అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రముఖ మ్యూజిక్ గ్రూప్ Chanticleer ఈ కార్యక్రమంలో 'బ్రహ్మమొక్కటే' కీర్తనను ఆలపించింది. ముఖ్యంగా పాటలోని భావాన్ని, స్వరంలోని మాధుర్యాన్ని విదేశీ గాయకులు చక్కగా ఆవిష్కరించడంతో ఈ పాట ప్రశంసలను అందుకుంటోంది. అయితే తాజాగా ఈ బృందం ఆలపించిన అన్నమయ్య కీర్తన వీడియోపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇది అద్భుతమైన ప్రదర్శన అంటూ గ్రామీ అవార్డు విజేత Chanticleer కు చెందిన A cappella బృందాన్ని ప్రశంసించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య రచించిన బ్రహ్మమొక్కటే కీర్తనను స్విట్జర్లాండ్ లోని సోల్స్ బర్గ్ ఫెస్టివల్ 2026 వేదికపై ఆలపించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ బృందం తమ ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని అన్నారు. సరిహద్దులు, భాషలు, తరాలకు అతీతంగా నిలిచే మన తెలుగు సంస్కృతి, వారసత్వం గొప్పతనాన్ని ఈ అజరామరమైన కీర్తన నిదర్శనంగా నిలుస్తోందని సీఎం చంద్రబాబు కొనియాడారు.












Click it and Unblock the Notifications
