ప్రియుడి మోజులో భర్త, కొడుకుని చంపిన భార్య.. ఏం జరిగిందంటే..?
ప్రస్తుతకాలంలో వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలను కూల్చుతున్నాయి. భార్యాభర్తల మధ్య చిచ్చు రేపుతున్నాయి. వివిధ కారణాలతో ఇటీవలి కాలంలో వివాహేతర సంబధాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఉచ్చులో పడి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాగే వారి పిల్లల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ.. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను.. కన్న కొడుకుని చంపింది. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలోని బెంగుళూరులో జరిగింది.
పోలీసులుతెలిపిన వివరాల ప్రకారం.. అభినందన్, హరిణికి 2021లో పెళ్లి జరిగింది. వీరికి ఓ కొడుకు ఉన్నాడు. అయితే 2024 లో హరిణికి స్నాప్ చాట్ ద్వారా వినయ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అది కాస్త ప్రేమగా మారడంతో.. వినయ్ తో హరిణి వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే ఇదే విషయంపై భార్యాభర్తలైన హరిణి, అభినందన్ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో హరిణి ఎఫైర్ ను బయటపెట్టేందుకు.. ఆమె కాల్ డేటా రికార్డ్ కోసం భర్త పోలీసుల్ని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే తన ఎఫైర్ కు అడ్డుగా ఉన్న భర్తను చంపాలని వినయ్ తో కలిసి హరిణి ప్లాన్ వేసింది.

అలా ఇటీవల ఆదివారం అర్థరాత్రి 12:30 గంటలకు.. అభినందన్ గదిలోకి వెళ్లారు వినయ్, హరిణి. అభినందన్ కాళ్లను హరిణి పట్టుకోగా.. గొంతు నులిమి వినయ్ అతడ్ని చంపేశాడు. అయితే శబ్దాలు రావడంతో.. కుమారుడు నిద్ర లేచి, ఈ ఉదంతం మొత్తం చూశాడు. దీంతో.. తమ బండారం బయటపడుతుందని, అతడ్ని కూడా చంపేశారు రాక్షసులు. ఆపై తన భర్తతో పాటు కొడుకు స్పందించడం లేదని హరిణి డ్రామాలు ఆడింది. వాళ్లు ఎలా చనిపోయారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు నిజం బయటపడింది. వివాహేతర సంబంధం కోసం హరిణి తన ప్రియుడు వినయ్ తో కలిసి చంపిందని గుర్తించారు. దాంతో హరిణితో పాటు ఆమె ప్రియుడు వినయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications