తోటి జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులు.. నలుగురు మృతి

జమ్మూ కాశ్మీర్ కతువా జిల్లాలోని బసోహ్లీ హిల్స్ లోని సేవా పవర్ ప్రాజెక్ట్ లో ఉన్న CISF క్యాంప్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఈ క్యాంప్ లోని ఓ జవాన్ తోటి అధికారులపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు అధికారులు మృతి చెందారు. మృతుల్లో అసిస్టెంట్ కమాండెంట్ కూడా ఉన్నారు. వీరి మధ్య జరిగిన గొడవ కారణంగా కోపోద్రిక్తుడైన జవాన్ ఒక్కసారిగా తన తోటి అధికారులపై కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది.

సీఐఎస్ఎఫ్ క్యాంప్ లో ఈ ఘటన సెప్టెంబర్ 29 మంగళవారం రోజున సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు జరిగినట్లు స్పష్టం అవుతోంది. మృతులు అసిస్టెంట్ కమాండెంట్ అంకిత్ కుమార్ పాండే, సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ సింగ్, కానిస్టేబుల్ రఫిక్ అహ్మద్, కానిస్టేబుల్ సందీప్ కుమార్ గా గుర్తించారు. అయితే వీరిపై కాల్పులకు పాల్పడింది. హెడ్ కానిస్టేబుల్ అవధేష్ కుమార్ సింగ్ గా తేలింది.

సీఐఎస్ఎఫ్ క్యాంప్ లో వీళ్ల మధ్య గొడవ తర్వాత తన ఏకే-47 తో క్యాంప్ లోకి ప్రవేశించిన అవధేష్ నలుగురు అధికారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అలా వారిపై 150 రౌండ్స్ కాల్చినట్లు సీఐఎస్ఎఫ్ వెల్లడించింది. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడగా క్షతగాత్రులను హిమాచల్ ప్రదేశ్ లోని ఎన్ హెచ్ పీసీ హాస్పిటల్ కు తరలించారు. అయితే అక్కడ వాళ్లు చికిత్స పొందుతూ మృతి చెందారు.

CISF jawan shoots dead four officers Kathua Sewa Power Project hills of Basohli in Jammu amp amp Kashmir

ఇక వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇతరులకు ఆ ప్రాంతంలోకి నిషేధించారు. అవధేష్ కుమార్ ను అరెస్ట్ చేసి పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అంశాలను ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. అవధేష్ కుమార్ అలా కాల్పులకు పాల్పడటానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+