అల్వాల్ మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో బిగ్ ట్విస్ట్.. 12 మందికీ డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ
హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ వినియోగం ఆందోళన కలిగిస్తోంది. ఇంజెక్షన్లు, మాత్రలు, గంజాయి, సింథటిక్ డ్రగ్స్ రూపంలో ఉన్న పదార్థాలు యువతను నాశనం చేస్తున్నాయి. డ్రగ్స్ తీసుకున్న యువత తాము ఏం చేస్తున్నామో అర్థం కాక చిన్నారులు, మహిళలు, బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. చివరకు జైల్లో ఊచలు లెక్కపెడుతూ తమ విలువైన జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. అయితే ఇటీవల అల్వాల్ లో ఓ మైనర్ బాలికపై 8 మంది వ్యక్తులు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో మరో షాకింగ్ విషయం బయటపడింది.
ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే కేసు తీవ్రతను నిందితులను ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారించారు. ఈ మేరకు వారికి డ్రగ్స్ టెస్ట్ లు చేయగా 12 మందికీ పాజిటివ్ గా రావడంతో పోలీసులు షాక్ అవుతున్నారు. ఈ మేరకు నిందితులకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. వారికి మత్తు పదార్థాలు చేరవేస్తున్న ప్రధాన స్మగ్లర్లు ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు నగరంలో గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తున్న సరఫరాదారుల నెట్ వర్క్ పై ప్రత్యేక దృష్టి సారించారు.

ఇక ఈ దారుణ సంఘటన సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరిగినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే మొదట ఈ కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణలో మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే తాజాగా వీరందరికీ డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ గా రావడంతో మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టడంతో పోక్సో చట్టంతో పాటు, మత్తు పదార్థాల వినియోగానికి సంబంధించి ఎన్డీపీఎస్ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పంజా విస్తరిస్తుండటంపై సర్వత్రా ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications
