తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 20న బడ్జెట్..?
తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు రేపటి (సోమవారం, మార్చి 16 ) నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉదయం గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దాంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. మరోవైపు మార్చి 20న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు అంటే మార్చి 30 వరకు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మార్చి 16 సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 16 న గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. అలాగే మార్చి 20 న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక మార్చి 20 నుంచి 30వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానం పలికారు.

ఇక అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలను చర్చించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతన్నట్లు తెలుస్తోంది. వాటిలో ప్రధానంగా.. గిగ్ వర్కర్లు హక్కుల పరిరక్షణ కోసం కొత్త చట్టానికి మద్దతుపై చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలోని విద్యారంగంపై చర్చించనున్నట్లు సమాచారం. విద్యారంగంలో కొత్త విధానాల అమలు, మార్పులు, బడ్జెట్ కేటాయింపులపై చర్చ జరగనుంది. ఇక మూసీ నది ప్రక్షాళనపై చర్చ, కాళేశ్వరం ప్రాజెక్టు తదితర కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications