స్టార్ హీరోకి ఆ హీరోయిన్ సెంటిమెంట్.. ఒక్క పైసా తీసుకోకుండా సినిమాకి ఓకే !!
బాలీవుడ్ "బాద్‌షా".. షారూఖ్ ఖాన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండానే చిత్ర పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి "కింగ్ ఖాన్" గా ఎదిగారు. 1992లో 'దీవానా' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత హీరోగానే కాకుండా నెగటివ్ పాత్రలతో కూడా అదరగొట్టి క్రేజ్ ను పెంచుకోగలిగారు. ఇక 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే' (DDLJ), 'కుచ్ కుచ్ హోతా హై', 'దేవదాస్', 'వీర్-జారా' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. అలానే 'స్వదేశ్', 'చక్ దే ఇండియా', 'మై నేమ్ ఈజ్ ఖాన్' వంటి చిత్రాల ద్వారా నటుడిగా తన సత్తా చాటారు.
ఇక ఇటీవల కాలంలో పలు చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయినప్పటికీ.. 2023లో 'పఠాన్', 'జవాన్' సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు. కానీ "ఢంకీ" సినిమాతో కొంచెం ఢీలా పడ్డ షారూఖ్.. ఈసారి గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇటీవల 'జవాన్' చిత్రానికి గాను ఆయన జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా అందుకున్నారు. స్తుతం డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తో చేతులు కలిపి "కింగ్" సినిమా చేస్తున్నారు షారుఖ్. 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా 'కింగ్' సినిమా థియేటర్లలోకి రానుంది.

అంతే కాకుండా కింగ్ సినిమాలో హైలైట్ గా నిలిచే మరో అంశం ఏంటంటే.. ఈ చిత్రంలోనే షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ వెండితెరకు పరిచయం కాబోతోంది. ఇప్పటికే "ది ఆర్చీస్" అనే ఓటీటీ మూవీలో మెరిసిన సుహానా.. ఇప్పుడు తన తండ్రితో కలిసి పూర్తిస్థాయి యాక్షన్ రోల్‌లో కనిపించనుంది. రియల్ లైఫ్ తండ్రీకూతుళ్లు.. రీల్ లైఫ్‌లో కూడా ఎలాంటి మ్యాజిక్ చేస్తారని అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ చిత్రం కోసం కూడా షారూఖ్ ఖాన్ తనకు బాగా కలిసొచ్చిన విషయాన్ని ఫాలో అవుతున్నారట.
హిందీ చిత్ర పరిశ్రమలో ఆన్ స్క్రీన్ బెస్ట్ పెయిర్ గా నిలిచిన వారిలో షారూఖ్ ఖాన్ - దీపికా పదుకునే జంట ఒకటి. ఓం శాంతి ఓం నుంచి మొదలై.. పఠాన్, జవాన్ వరకు సక్సెస్ ఫుల్‌గా సాగింది. అందుకే ఆమెను తన లక్కీ ఛామ్‌గా ట్రీట్ చేస్తున్నారట షారూఖ్. అందుకే ఈ మూవీలో ఈ స్టార్ బ్యూటీ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారని జోరుగా చర్చ నడుస్తోంది. ఇందులో దీపికా సుహానాకు తల్లి క్యారెక్టర్ చేయబోతోందని టాక్ వినిపిస్తుంది.
అయితే ఈ చిత్రంలో దీపికా పాత్ర ఎక్కువ సేపు ఉండదని సమాచారం. కానీ షారూఖ్ కోసం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సినీ వర్గాలలో చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రస్తుతం సినిమాకు రూ.25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోన్న దీపికా.. షారూఖ్‌తో ఉన్న ఫ్రెండ్ షిప్ కొద్ది రెమ్యునరేషన్ తీసుకోకుండా వర్క్ చేస్తానందట. దీంతో ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. చూడాలి మరి షారుఖ్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా ? లేదా ?? అని.












Click it and Unblock the Notifications