'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే'
సోషల్ మీడియాలో 'వడాపావ్ గర్ల్'గా పేరుపొందిన చంద్రికా దీక్షిత్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెటిజన్లను విస్మయానికి గురిచేయడమే కాకుండా తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఓ తల్లిగా తన బాధ్యత గురించి ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఢిల్లీ వీధుల్లో వడాపావ్ అమ్ముతూ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన చంద్రికా దీక్షిత్.. ఆ తర్వాత బిగ్‌బాస్ ఓటీటీ3లో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాయి.
ఏమిటా వివాదాస్పద కామెంట్స్
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆర్థిక పరిస్థితుల గురించి, బిడ్డను పెంచే బాధ్యత గురించి చంద్రకా దీక్షిత్ మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "ఒక తల్లిగా నేను ఒక పెద్ద మాట చెబుతున్నాను. నన్ను జనం ఎలా జడ్జ్ చేస్తారో నాకు తెలియదు, కానీ నా బిడ్డను పెంచడం కోసం నేను ఎవరితోనైనా పడుకోవాల్సి వచ్చినా నేను దానికి సిద్ధమే. కానీ, నా బిడ్డను మాత్రం పెంచుకుంటాను" అని ఆమె పేర్కొన్నారు.

నెటిజన్ల ఆగ్రహం.. ఇది పబ్లిసిటీ స్టంట్
ఈ ఇంటర్వ్యూ క్లిప్ బయటకు రాగానే నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. "పిల్లవాడిని పెంచడానికి గౌరవప్రదమైన పనులు ఎన్నో ఉన్నాయి, వాటిని వదిలేసి ఇలాంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం?" అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి కామెంట్లు సమాజంలో తప్పుడు సంకేతాలను పంపుతాయని, తల్లి పాత్రను ఇంత దిగజార్చడం సరికాదని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. చాలామంది ఆమె వ్యాఖ్యలను 'పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంట్' అని కొట్టిపారేస్తున్నారు. తన పేరును వార్తల్లో ఉంచుకోవడానికే ఆమె ఇలాంటి వివాదాస్పద మాటలు మాట్లాడుతున్నారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Chandrika Dixit aka Vada Pav Girl
— ︎ ︎venom (@venom1s) March 14, 2026
She said that - If I have to sleep with someone to earn money to raise my child, I'll do it.
Why are modern empowered feminist girls always ready to do prostitution?
Why can't she get a job or sell vada pav for money?
Is this empowering? pic.twitter.com/ifxxbPkH7d
ఎవరీ చంద్రికా దీక్షిత్?
ఢిల్లీలో వడాపావ్ స్టాల్ పెట్టుకుని తనదైన శైలిలో వీడియోలు చేస్తూ పాపులర్ అయిన చంద్రికా దీక్షిత్.. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇంతకుముందు ఆమె వ్యక్తిగత జీవితం, వివాహాల గురించి కూడా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరిగాయి. ఇప్పుడు ఈ కొత్త వ్యాఖ్యలు ఆమె ప్రతిష్టను మరింత దెబ్బతీసేలా ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓ బాధ్యతాయుతమైన తల్లిగా మాట్లాడాల్సిన మాటలు, ఇంత వివాదాస్పదంగా మారడం పట్ల చాలామంది నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కోసం ఎంతటి స్థాయికి దిగజారడానికైనా సిద్ధమేనా అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications