గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!?

వంట గ్యాస్ కొరత పెరుగుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో హోటళ్లు బంద్ అయ్యాయి. సామాన్య వినియోగ దారులు సైతం ముందస్తు బుకింగ్స్ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా దాదాపు నిలిచిపోయింది. అటు కేంద్రం మాత్రం గ్యాస్ పైన ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెబుతోంది. ఇదే సమయంలో పెరిగిన డిమాండ్.. కొరత వేళ మరో సారి గ్యాస్ ధరలు పెంపు ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి.

గ్యాస్ కొరత వేళ మరో సారి ధరల పైన ఆయిల్ కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం యుద్దం కారణంగా వంట గ్యాస్ కొరత ఏర్పడింది. కేంద్రం మాత్రం వాణిజ్య అవసరాలకు సరఫరా తగ్గించి.. డొమెస్టిక్ సరఫరా పెంచాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించింది. ఇప్పటికే 30 శాతం మేర సరఫరా పెరిగినట్లు వెల్లడించింది. అయితే.. వాణిజ్య సిలిండర్ల సరఫరా లేక పలు ప్రాంతాల్లో హోటళ్లు బంద్ అయ్యాయి. ఆహార పదార్ధాల ధరలు పెరిగాయి. పెళ్లిళ్లు, కేటరింగ్ పైన వంట గ్యాస్ కొరత ప్రభావం కనిపిస్తోంది.

lpg-cylinder-prices-likely-to-raise-again-due-to-the-iran-israel-conflict-disrupting-global-gas-su

ఇప్పటికే యుద్దం కారణంగా వంట గ్యాస్ ధరలను భారీగా పెంచి అమలు చేస్తున్నారు. డొమెస్టిక్ సిలిండర్ ధరపై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 ఒకేసారి పెంచింది. కొరత వేళ సామాన్య వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్ లైన్ లో ప్రయత్నం చేస్తున్నా.. సాధ్యం కావటం లేదు. దీంతో.. ఏజెన్సీల వద్దకు వినియోగ దారులు పరుగులు తీస్తున్నారు.

కొరత లేదంటున్న కేంద్రం.. పెరుగుతున్న ఆందోళన

గ్యాస్ కొరత పైన కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. ముందస్తు బుకింగ్స్ అవసరం లేదని పేర్కొంది. అయితే, క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పెరుగుతున్న డిమాండ్.. కొరత వేళ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం గ్యాస్ కొరత ఉందనే పుకార్లను తోసిపుచ్చినప్పటికీ.. భయం భయాందోళనలు ప్రజలను పట్టుకున్నాయి. దీంతో బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొందరు గ్యాస్‌ని విక్రయిస్తున్నారు. వాణిజ్య సిలిండర్లు మాత్రమే దొరకడం లేదు.

LPG cylinder prices likely to raise again due to the Iran-Israel conflict disrupting global gas supplies

డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల డెలివరీ కూడా ఆలస్యం అవుతోంది. ఈ పరిస్థితుల క్రమంలో మరోసారి గ్యాస్ ధరలు పెరగొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ సారి ఇంటికి వినియోగించే వంట గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉండదని... కమర్షియల్ ధరలు మాత్రం పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. రేపు ఈ మేరకు నిర్ణయం వస్తుందనే చర్చ సాగుతోంది. ఇప్పటికే హోటళ్లలో ధరలు పెంచేసారు. ఇంకా ఇప్పుడు సిలిండర్ల ధర పెరిగితే.. రేట్లు మరింతగా పెరగటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+