సింహరాశి ఉగాది ఫలితాలు.. ఈ ఏడాది వీరికి గడ్డుకాలం.. అయినా సరే..
పరాభవ నామ సంవత్సరం మార్చి 19వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతకాలను గురించి తెలుసుకుంటున్న క్రమంలో ప్రస్తుతం మనం సింహ రాశి వారి జాతకం ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ సంవత్సరం సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి.
సింహరాశి వారి జాతకఫలం
జ్యోతిష గణాంకాల ప్రకారం సింహరాశి వారి ఆదాయం 5, వ్యయం 5 గా ఉంది. రాజపూజ్యం 7 అవమానం 7గా ఉంది. సంవత్సరం కుటుంబ కారకుడైన గురువు 12వ ఇంట్లో కేతువుతో కలిసి సంచారం చేయడం వల్ల ఇది అనేక సవాళ్లను తీసుకొస్తుంది. దీని కారణంగా సింహరాశి జాతకులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు.

ఆర్థికస్థితి
సింహ రాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభంలో నష్టాలు కనిపించినా చివరికి ఆదాయం, రాజ పూజ్యత కనిపిస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లాభాలను ఇస్తాయి. సింహ రాశి వారు తెలివితేటలతో గడ్డు సమస్యల నుండి బయటపడతారు. ప్రారంభంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న తరువాత ఆర్థికంగా పరవాలేదనిపిస్తుంది. గృహనిర్మాణాలు, వాహన ప్రాప్తి కలుగుతాయి.
ఉద్యోగులకు
సింహరాశి ఉద్యోగులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు. గురు శని గ్రహాల ప్రభావంతో అసంతృప్తి, మాటల్లో స్థిరత్వం లోపిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే వారికి సుదూర ప్రాంతాలకు బదిలీలు, సస్పెన్షన్లు ఎదురయ్యే అవకాశం ఉంది. అధికారుల నుండి ఇబ్బందులను ఎదుర్కొంటారు. సింహరాశి జాతకులకు నిరాశ మిగులుతుంది. నిరుద్యోగులకు ఆశాజనకమైన పరిస్థితులు ఉండవు.
వ్యాపారులకు
సింహరాశి వ్యాపారులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆశించిన స్థాయిలో లాభాలు వచ్చే అవకాశం లేదు. బంగారం, వెండి వ్యాపారులకు నష్టాలు ఎదురవుతాయి. నిర్మాణ రంగానికి చెందిన వ్యాపారాలు చేసే వారికి సాధారణ ఫలితాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు తగాదాల కారణంగా విడిపోయే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు మాత్రం రాణించే సూచనలు కనిపిస్తున్నాయి.
విద్యార్థులకు
సింహరాశి లోని విద్యార్థులకు పరాభవ నామ సంవత్సరం అంతా అనుకూలంగా ఉండదు. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. చదువుపై కంటే ఇతర వ్యాపకాల పైన దృష్టి ఎక్కువ సారిస్తారు. బొటాబొటి మార్కులతో ఉత్తీర్ణులైనవారు. ఇంజనీరింగ్, మెడిసిన్, బీఈడీ, లాసెట్, ఎంసెట్, పాలిటెక్నిక్ వంటి పరీక్షలలో మంచి మార్కులు సాధించే అవకాశం లేదు. కోరుకున్న కళాశాలలో సీట్లు దొరకవు. ఇది విద్యార్థులకు గడ్డుకాలం
ఆరోగ్యం
సింహ రాశి వారికి ఈ సంవత్సరం శారీరక మానసిక కుంగుబాటు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యంగా కంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. అవమానకరమైన పనులు ఇబ్బంది పెడతాయి. అపనిందలు వస్తాయి. రావలసిన సొమ్ము ఆటంకాలతో రాకుండా పోతుంది. ఇవ్వాల్సిన సమయానికి డబ్బు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. ఊహించని సంఘటనలు ఎక్కువగా జరగడం వల్ల ఇబ్బంది పడతారు.
సింహరాశి వారికి ఇది కష్టకాలం
ఈ సంవత్సరం సింహ రాశి వారికి చాలా కష్ట కాలంగా చెప్పవచ్చు. ధైర్య సాహసాలతో ముందుకు అడుగు వేస్తేనే ఈ సంవత్సరం గట్టెక్కుతుంది. సహనంతోనూ, సంయమనంతోను వ్యవహరించి కష్టపడితే ఫలితం ఉంటుంది. ఇది సింహరాశి వారికి చాలా ఫలదాయకమైన సంవత్సరంగా చెప్పవచ్చు.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications