వాట్సాప్‌లో బిగ్ అప్‌డేట్.. 14 రోజుల ముందే మెసేజ్‌లు పంపొచ్చు!

వాట్సాప్ వినియోగదారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 'షెడ్యూల్ మెసేజెస్' ఫీచర్‌ను మెటా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా వినియోగదారులు తమకు కావాల్సిన తేదీ, సమయంలో మెసేజ్ లు పంపేందుకు ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు. కనీసం 10 నిమిషాల నుంచి గరిష్టంగా 14 రోజుల ముందు వరకు మెసేజ్‌లను షెడ్యూల్ చేసే సౌకర్యం ఇందులో ఉంది.

WhatsApp: వాట్సాప్ వెబ్ వాడే ఉద్యోగులకు కేంద్రం హెచ్చరికలు..! 7 సూచనలు..!
WhatsApp: వాట్సాప్ వెబ్ వాడే ఉద్యోగులకు కేంద్రం హెచ్చరికలు..! 7 సూచనలు..!

ఫీచర్ ప్రత్యేకతలు ఇవే..!
పుట్టినరోజు శుభాకాంక్షలు, అపాయింట్‌మెంట్ రిమైండర్లు, ఆఫీస్ పనులకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే సిద్ధం చేసి షెడ్యూల్ చేయవచ్చు. వన్-టు-వన్ చాట్‌లతో పాటు గ్రూప్ చాట్‌లలోనూ ఈ ఫీచర్ పనిచేస్తుంది. టెక్స్ట్ మెసేజ్‌లతో పాటు ఫోటోలు, వీడియోలను కూడా షెడ్యూల్ చేయవచ్చు. ఛానెల్స్‌లో ఈ సదుపాయం ప్రస్తుతం అందుబాటులో లేనప్పటికీ.. భవిష్యత్తు అప్‌డేట్‌లలో వచ్చే అవకాశం ఉంది. షెడ్యూల్ చేసిన సమయంలో మీ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉన్నా లేదా బ్యాటరీ అయిపోయినా ఆ మెసేజ్ నిర్ణీత సమయానికి గ్రహీతకు చేరుతుంది. పంపే ముందు మనసు మార్చుకుంటే షెడ్యూల్ చేసిన మెసేజ్‌లను ఒకే చోట చూసి డిలీట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.

WhatsApp Schedule Messages Feature How to Send Texts Photos and Videos Up to 14 Days Ahead Full Details

సాధారణ మెసేజ్‌ల మాదిరిగానే షెడ్యూల్ మెసేజ్‌లకు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత ఉంటుంది. పంపినవారు, అందుకున్నవారు తప్ప వాట్సాప్ సహా మరెవరూ వాటిని చదవలేరు. టెలిగ్రామ్, సిగ్నల్ వంటి పోటీ యాప్‌లలో ఇప్పటికీ ఈ సదుపాయం ఉండగా.. ఇటీవల వాట్సాప్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన కునాల్ షా యాప్‌ను మరింత సరళతరం చేయడం, ఏఐ ఫీచర్లు, ఫిన్‌టెక్ విస్తరణపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ ఫీచర్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా యూజర్లు ఉండగా.. ఇండియాలోనే 50 కోట్లకు పైగా వాట్సాప్ వినియోగదారులు ఉన్నారు. రాబోయే వారాల్లో ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా అందుబాటులోకి రానుంది.

నెమ్మదిగా కదిలే తుఫాన్లతో వచ్చే ప్రమాదం ఏమిటి?
నెమ్మదిగా కదిలే తుఫాన్లతో వచ్చే ప్రమాదం ఏమిటి?

వాట్సాప్‌లో మెసేజ్ షెడ్యూల్ చేసే విధానం
ఈ ఫీచర్ ను ఉపయోగించే ముందు వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రింది దశలను అనుసరించాలి.

*వాట్సాప్ ఓపెన్ చేసి మెసేజ్ పంపాల్సిన చాట్‌లోకి వెళ్లాలి.
* పంపాల్సిన టెక్స్ట్ టైప్ చేయాలి.(ఫోటో లేదా వీడియో పంపాలంటే వాటిని ఎంచుకోవాలి)
*సెండ్ బటన్‌ను నొక్కి పట్టుకోవాలి.
*మెసేజ్ ఎప్పుడు వెళ్లాలో డేట్, సమయాన్ని ఎంచుకోవాలి.
*వివరాలను నిర్ధారించి షెడ్యూల్ సెట్ చేయాలి.
*నిర్ణీత టైమ్ వచ్చినప్పుడు గ్రహీతకు ఇది సాధారణ మెసేజ్‌లాగే కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+