నెమ్మదిగా కదిలే తుఫాన్లతో వచ్చే ప్రమాదం ఏమిటి?

ప్రకృతి మరోసారి తన ప్రతాపం చూపించేందుకు సిద్ధమవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన 'అక్వాన్' తుఫాను ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతోంది. రానున్న శుక్రవారం (నవంబర్ 20న) ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీతో పాటు పొరుగునే ఉన్న తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేశారు. అయితే ఈ తుఫాను గంటకు కేవలం 3 కిలోమీటర్ల వేగంతో అతి నెమ్మదిగా, నత్తనడకన కదులుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. తుఫాను వేగం తక్కువగా ఉందంటే అది ప్రమాదకరం కాదని అనుకోవడానికి వీలేదని, అసలు ప్రమాదమే ఈ నెమ్మదైన ప్రయాణంలోనే దాగి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

నెమ్మదిగా కదిలే తుఫాన్లతో వచ్చే ప్రమాదం ఏమిటి?

తుఫాను వేగం తక్కువగా ఉంటే ఆ ప్రాంతంపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ అంశంపై జర్నల్ ఆఫ్ హైడ్రోమెట్రాలజీలో ప్రచురితమైన ఒక శాస్త్రీయ అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తుఫాను కదిలే వేగానికి, దాని వల్ల జరిగే వరద ముప్పునకు మధ్య విడదీయరాని సంబంధం ఉంది. నెమ్మదిగా కదిలే తుఫానులు ఒకే ప్రాంతంపై ఎక్కువ సమయం కేంద్రీకృతమై ఉంటాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో మేఘాలు కదలకుండా ఉండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తాయి. ఫలితంగా భారీ వర్షపాతం నమోదై, నదులు పొంగిపొర్లడంతో పాటు తీవ్రమైన వరదలు ముంచెత్తే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.

Why Slow Moving Cyclone Akvan Is A Bigger Danger For Andhra Pradesh And Telangana According To Science

వాన వడగాల్పుల లెక్కలు చెబుతున్న నిజాలు..

మరోవైపు నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. వేగంగా కదిలే తుఫానులతో పోలిస్తే, నెమ్మదిగా కదిలే తుఫానులలో తక్షణ వర్షపాతం రేటు కాస్త తక్కువగా ఉండవచ్చు. కానీ, అవి ఒకే ప్రాంతంపై ఎక్కువ గంటలు లేదా రోజులు తిష్ట వేసి ఉండటం వల్ల పడే మొత్తం వర్షం (క్యూములేటివ్ రెయిన్‌ఫాల్) అంచనాలకు మించి ఉంటుంది. అంటే తక్కువ వేగమే ఆ ప్రాంతానికి ఎక్కువ ముప్పును తెచ్చిపెడుతుంది. గాలి వేగం ఎంత ఉందనే దానికంటే కూడా తుఫాను పరిమాణం, అది కదిలే తీరు, ఎంతకాలం ఒకేచోట నిలకడగా ఉందనే అంశాలే విధ్వంస తీవ్రతను నిర్ణయిస్తాయి.

Cyclone Akvan: ఏపీకి భారీ ఊరట- తుఫాన్ యూటర్న్- అంతకంతకూ..!
Cyclone Akvan: ఏపీకి భారీ ఊరట- తుఫాన్ యూటర్న్- అంతకంతకూ..!

ఎల్ నినో ఎఫెక్ట్.. వరుస తుఫానులకు అసలు కారణం..

అక్వాన్ తుఫాను విషయానికి వస్తే.. వాతావరణ నిపుణులను ఎక్కువగా కలవరపెడుతున్న మరో ప్రధాన అంశం తక్కువ వ్యవధిలో వరుసగా మూడు తుఫానులు ఏర్పడటం. అక్టోబర్ 28న 'అర్ణబ్' తుఫాను నర్సాపురం దగ్గర తీరాన్ని దాటగా, నవంబర్ 3న 'మురాసు' తుఫాను ఒంగోలు సమీపంలో తీరాన్ని తాకింది. ఇప్పుడు మూడోదిగా 'అక్వాన్' ముంచుకొస్తోంది. సాధారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో తుఫానులు రావడం సహజమే అయినప్పటికీ, ఇలా వరుసగా మూడు రావడం మాత్రం సముద్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలకు, 'ఎల్ నినో' (El-Nino) ప్రభావానికి నిదర్శనమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఆ రెండు తుఫాన్లను మించిన ముప్పు-అక్వాన్ పై తేల్చేసిన పవన్..! రేపటి నుంచి..!
ఆ రెండు తుఫాన్లను మించిన ముప్పు-అక్వాన్ పై తేల్చేసిన పవన్..! రేపటి నుంచి..!

చరిత్ర పునరావృతమవుతున్న వైనం..

ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా ప్రకారం ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. సముద్రపు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో అసాధారణ రీతిలో తుఫానుల తాకిడి పెరిగింది. సరిగ్గా ఇలాంటి పరిస్థితులే గతంలో 1976, 1987 సంవత్సరాల్లోనూ కనిపిచాయి. ఆ రెండు సంవత్సరాలు కూడా ఎల్ నినో ప్రభావం ఉన్న సంవత్సరాలే కావడం, అప్పట్లో కూడా ఏపీలో ఒకే నెలలో మూడు తుఫానులు విరుచుకుపడటం గమనార్హం. ప్రస్తుతం వస్తున్న అక్వాన్ తుఫాను నెమ్మదిగా కదులుతూ భారీ వర్షాలు కురిపించే ప్రమాదం ఉన్నందున, తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+