తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి!
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక హై-వోల్టేజ్ సినిమాను తలపిస్తున్నాయి. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల సమరశంఖం, మరోవైపు 'దళపతి' విజయ్ వ్యక్తిగత జీవితంపై సాగుతున్న చర్చలు.. వెరసి కోలీవుడ్ నుంచి కోట వరకు ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా తన విడాకుల వ్యవహారంపై తన మాజీ భార్యను ఉద్దేశించి విజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, తమిళ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తనపై వస్తున్న వ్యక్తిగత విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తూత్తుకుడి, తిరునెల్వేలి బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ.. తన చుట్టూ ఉన్నవారే తనను వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. "30 ఏళ్లుగా నా చుట్టూ ఉన్నవారు, సరిగ్గా ఎన్నికలకు 30 రోజుల ముందు నన్ను అపఖ్యాతి పాలు చేయాలని చూస్తున్నారు. కానీ, మీరు ఎన్ని కష్టాలు పెట్టినా ప్రజల నుంచి నన్ను వేరు చేయలేరు" అని ఆయన ఎమోషనల్ గా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు నేరుగా ఆయన భార్య సంగీతను ఉద్దేశించి చేసినవేనని బహిరంగ చర్చ జరుగుతుంది.

విడాకుల పిటిషన్.. ఆరోపణల పర్వం!
విజయ్ మరియు సేవకీత సూర్నాలం మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. 2026 ఫిబ్రవరిలో సేవకీత చెంగల్పట్టు కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆమె విజయ్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. నటి త్రిష కృష్ణన్‌తో విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, తద్వారా తమ వైవాహిక బంధం దెబ్బతిందని ఆమె పేర్కొన్నారు. శాశ్వత భరణం మరియు నివాస హక్కులను కోరుతూ ఆమె వేసిన పిటిషన్ ఇప్పుడు విజయ్ రాజకీయ ప్రతిష్ఠపై ప్రభావం చూపుతోంది.
త్రిష క్లారిటీ.. రూమర్లకు చెక్!
మరోవైపు, విజయ్ పేరుతో తనను ట్రోల్ చేస్తున్న వారికి నటి త్రిష కృష్ణన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. "నాకు ఒక వ్యాపారవేత్తతో పెళ్లయిందని, నలుగురు పిల్లలు ఉన్నారని కూడా వార్తలు రాస్తున్నారు. ఇకనైనా ఈ ట్రోల్స్ ఆపండి" అని ఆమె మండిపడ్డారు. తన వ్యక్తిగత విషయాలపై ఇష్టానుసారంగా వార్తలు ప్రచారం చేయవద్దని ఆమె హితవు పలికారు.
రాజకీయ సమరంలో 'డబ్బు సంచుల' విమర్శలు
విజయ్ తన వ్యక్తిగత బాధను పక్కన పెట్టి మరీ.. అధికార DMK ప్రభుత్వంపై విమర్శల దాడిని ముమ్మరం చేశారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని "డబ్బు సంచుల కూటమి"గా, "దోపిడీ నిధులతో ఏర్పడిన పర్యవేక్షక ప్రభుత్వం"గా ఆయన అభివర్ణించారు. ఏప్రిల్ 23న జరగబోయే ఎన్నికలు కేవలం రాజకీయ ప్రక్రియ మాత్రమే కాదని, ఇది ఒక భావోద్వేగ ప్రయాణమని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
మే 4: యాదృచ్ఛికమా? మరేదైనా?
తమిళనాడులో 234 నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. అయితే, మే 4న విడుదలయ్యే ఫలితాల తేదీపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆ రోజు విజయ్ 'Alleged Girlfriend' గా వార్తల్లో ఉన్న త్రిష పుట్టినరోజు కావడం విశేషం. మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న విజయ్ కి ఈ ఫలితాలు ఎలాంటి తీర్పునిస్తాయో, ఆయనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతాయో లేదో చూడాలి.
Thalapathy on the rumours spread about him 👌🏽👌🏽 pic.twitter.com/TD0mF402Q8
— Vijay Fans Trends (@VijayFansTrends) April 8, 2026
-
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
Tamil Nadu Verdict: తమిళనాట సీన్ రివర్స్-డీఎంకేకు షాకిచ్చిన తాజా సర్వే..! -
దళపతి విజయ్‌కు బిగ్ షాక్: రిలీజ్‌కు ముందే ‘జన నాయగన్’ లీక్! -
TVK: విజయ్ కు వరుస షాకులు..నామినేషన్ రిజెక్ట్..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు.














Click it and Unblock the Notifications