ఐపీఎల్ సెన్సేషన్‌కు మరో ప్రమోషన్.. బుడ్డోడికి కెప్టెన్సీ పగ్గాలు!

టీమిండియా యువ సెన్సేషన్, ఐపీఎల్ స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి బీహార్ క్రికెట్ అసోసియేషన్ భారీ బాధ్యతను అప్పగించింది. నవంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026-27 టోర్నమెంట్ కోసం బీహార్ సీనియర్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీని నియమించింది. ఓ సీనియర్ రాష్ట్ర జట్టుకు వైభవ్ సూర్యవంశీ నాయకత్వం వహించడం ఇదే తొలిసారి.

కోహ్లీ.. కింగ్ ఆఫ్ ఛేజింగ్: ఇన్నాళ్లకు సచిన్ టెండుల్కర్ రికార్డ్ బద్దలు
కోహ్లీ.. కింగ్ ఆఫ్ ఛేజింగ్: ఇన్నాళ్లకు సచిన్ టెండుల్కర్ రికార్డ్ బద్దలు

తొలి రెండు మ్యాచ్‌లకు 17 మంది సభ్యుల జట్టు ప్రకటన
బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హర్షవర్ధన్ శుక్రవారం 17 మంది సభ్యులతో కూడిన బీహార్ జట్టును ప్రకటించారు. టోర్నీలోని తొలి రెండు మ్యాచులకు వైభవ్ సూర్యవంశీ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. సూరజ్ కశ్యప్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. నవంబర్ 14న ఇండోర్ వేదికగా సౌరాష్ట్రతో జరిగే తొలి పోరుతో బీహార్ తన పోరాటాన్ని ప్రారంభించనుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బీహార్ జట్టు గ్రూప్-బీలో స్థానం సంపాదించింది. ఈ గ్రూపులో ఢిల్లీ, హర్యానా, జమ్మూ-కాశ్మీర్, పంజాబ్, రైల్వేస్, సౌరాష్ట్ర, తమిళనాడు వంటి బలమైన జట్లు ఉన్నాయి.

Vaibhav Sooryavanshi Named Bihar Captain for Syed Mushtaq Ali Trophy 2026-27 Full Details Here

ఐపీఎల్ 2026లో పరుగుల సునామీ
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొత్తం 16 ఇన్నింగ్స్‌లలో 237కి పైగా స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 పరుగులు చేసి టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా భారత టీ20 అంతర్జాతీయ జట్టు తరఫున ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడాడు.

IND vs NZ: ఒక్కడే చాలు అనిపించిన కోహ్లీ.. తొలి వన్డేలో ఘన విజయం!
IND vs NZ: ఒక్కడే చాలు అనిపించిన కోహ్లీ.. తొలి వన్డేలో ఘన విజయం!

ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టుపై కేవలం 80 బంతుల్లోనే 175 పరుగుల మెరుపు సెంచరీతో భారత్ 100 పరుగుల తేడాతో వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండే జట్టుతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ 19 బంతుల్లో 45 పరుగులు చేసి అభిషేక్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.

నాయకుడిగా ఎదుగుతాడు: బీసీఏ అధ్యక్షుడు
వైభవ్ సూర్యవంశీకి కెప్టెన్సీ ఇవ్వడంపై బీసీఏ అధ్యక్షుడు హర్షవర్ధన్ స్పందిస్తూ.. "చిన్న వయస్సులోనే వైభవ్ సూర్యవంశీ తన అసాధారణ ప్రతిభ, ఆత్మవిశ్వాసం, ఆట పట్ల పరిణతిని నిరూపించుకున్నాడు. ఈ కెప్టెన్సీ బాధ్యత అతడిని గొప్ప లీడర్‌గా తీర్చిదిద్దడానికి దోహదపడుతుంది. వైభవ్ నాయకత్వంలో జట్టు క్రమశిక్షణతో మంచి ఫలితాలు సాధిస్తుందని భావిస్తున్నాం" అని వెల్లడించారు.

బీహార్ 17 మంది సభ్యుల జట్టు:
వైభవ్ సూర్యవంశీ(కెప్టెన్), అలోక్ కుమార్, ఆయుష్ లోహరుకా(వికెట్ కీపర్), అల్తమష్ అష్రఫ్, పరమ్ కుమార్ సింగ్, అన్మోల్ కుమార్(వికెట్ కీపర్), రిత్విక్ రాజ్, సూరజ్ కశ్యప్(వైస్ కెప్టెన్), మయాంక్ కుమార్, రాఘవేంద్ర ప్రతాప్, ఆశిష్ కుమార్, వాసుదేవ్ ప్రతాప్ సింగ్, మహమ్మద్ ఇజ్హార్, అమోద్ యాదవ్, ప్రశాంత్ సింగ్, నవాజ్ ఖాన్, హిమాన్షు సింగ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+