మోదీ జీని కన్ఫ్యూజ్ చేయకండి అమిత్ షా జీ.. రాహుల్ సవాల్!

సర్(SIR) ప్రక్రియ, ఓట్ల చోరీ వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీతో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి సవాల్ చేశారు. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రకరకాల కామెంట్స్ చేస్తూ ప్రధాని మోదీకి గురిచేయవద్దని, తనతో బహిరంగ చర్చకు మోదీని అంగీకరించాలని రాహుల్ గాంధీ కోరారు.

సంక్షేమ పథకాలకు ఓటర్ ఐడీ లింక్.. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
సంక్షేమ పథకాలకు ఓటర్ ఐడీ లింక్.. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధం
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ స్పందిస్తూ.. "అమిత్ షా జీ.. మోదీ జీని కన్ఫ్యూజ్ చేయకండి. నాతో బహిరంగ చర్చకు రావడానికి ఆయనను ఒప్పించండి. వేదిక ఏదైనా నేను సిద్ధం. భయపడకండి(డరో మత్)" అని రాహుల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లోనూ, బయట సర్ ప్రక్రియపై అమిత్ షా మాట్లాడిన రెండు వేర్వేరు వీడియో క్లిప్‌లతో కూడిన వీడియోను రాహుల్ గాంధీ పంచుకున్నారు.

Rahul Gandhi Challenges PM Narendra Modi to Open Debate on SIR Issue Hits Out at Amit Shah

అమిత్ షా యూటర్న్ తీసుకున్నారంటూ కాంగ్రెస్ విమర్శలు
2025 డిసెంబర్ 10న రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు పార్లమెంట్‌లో సమాధానమిస్తూ.. సర్ ప్రక్రియ అనేది ఎన్నికల సంఘం పరిధిలోని అంశమని, దానిపై పార్లమెంట్ లో చర్చ జరగలేదని అమిత్ షా పేర్కొన్నారు. అయితే ఇటీవల(నవంబర్ 5) హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడిన అమిత్ షా.. సర్ ప్రక్రియపై ప్రతిపక్షాలకు నిజంగా చర్చ జరిపే ధైర్యం ఉంటే పార్లమెంట్ ప్రత్యేక సభకు రావాలని, తాము చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

ప్రపంచంలోనే ఒక్కడు.. చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ!
ప్రపంచంలోనే ఒక్కడు.. చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ!

అమిత్ షా ఇలా మాట మార్చడంపై స్పందించిన రాహుల్ గాంధీ.. పార్లమెంట్ పరిమితులకు లోబడి కాకుండా ఏ వేదికపైనైనా ప్రధాన నరేంద్ర మోదీ నేరుగా తనతో ముఖాముఖి చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+