CBSE 10th, 12th బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల..!

ఈ ఏడాది సీబీఎస్ఈ (CBSE) పదో తరగతి, 12వ తరగతి చదువుతున్న విద్యార్ధులకు వచ్చే ఏడాది పరీక్షల షెడ్యూల్ ను కేంద్ర ప్రాథమిక విద్య బోర్డు విడుదల చేసింది. ఇవాళ విడుదల చేసిన డేట్ షీట్ ప్రకారం పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న ప్రారంభం కానున్నాయి. అన్ని పరీక్షలూ ఉదయం 10.30కు ప్రారంభమవుతాయని బోర్డు ప్రకటనలో పేర్కొంది. పరీక్షలకు 101 రోజుల సమయం ఉండగానే ఇవాళ డేట్ షీట్స్ విడుదలయ్యాయి.

IIT: ఐఐటీల్లో ఊహించని మార్పు.. సీఎస్‌ఈని వదిలి ఆ బ్రాంచ్ కు విద్యార్దుల పరుగు..!
IIT: ఐఐటీల్లో ఊహించని మార్పు.. సీఎస్‌ఈని వదిలి ఆ బ్రాంచ్ కు విద్యార్దుల పరుగు..!
AI ఉద్యోగాల్ని తీసేయట్లేదు- ఇలా మారుస్తోంది..! ఐఐటీ మద్రాస్ షాకింగ్ రిపోర్ట్..!
AI ఉద్యోగాల్ని తీసేయట్లేదు- ఇలా మారుస్తోంది..! ఐఐటీ మద్రాస్ షాకింగ్ రిపోర్ట్..!

పదో తరగతి విద్యార్ధులకు ఫిబ్రవరి 16న పెయింటింగ్ సబ్జెక్ట్ పరీక్ష ఉంటుంది. మ్యాథ్స్ పరీక్ష ఫిబ్రవరి 17న, సైన్స్ ఫిబ్రవరి 22న, ఇంగ్లీష్ ఫిబ్రవరి 26న, తెలుగు మార్చి 5న, సోషల్ స్టడీస్ మార్చి 8న ఉంటాయి. అలాగే 12వ తరగతి విద్యార్ధులకు ఫిబ్రవరి 16న ఫిజిక్స్, 23న అకౌంటెన్సీ, 27న కెమిస్ట్రీ, మార్చి 3న తెలుగు, 5న ఇంగ్లీష్ కోర్, మార్చి 9న మ్యాథ్స్, 16న ఎకనామిక్స్, 19న పొలిటికల్ సైన్స్, 25న బయాలజీ, 27న హిస్టరీ, 30న సోషియాలజీ, 31న కంప్యూటర్ సైన్స్, ఏప్రిల్ 1న బిజినెస్ స్టడీస్ పరీక్షలుంటాయి.

CBSE releases datesheet for class 10 12 board exams 2027
టాపర్లకు విజయ్ మర్చిపోలేని కానుక..! గోల్డ్ చైన్, నగదు బహుమతులు..!
టాపర్లకు విజయ్ మర్చిపోలేని కానుక..! గోల్డ్ చైన్, నగదు బహుమతులు..!

సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో భాగంగా 10వ తరగతికి మొత్తం 83 సబ్జెక్టుల్లో, అలాగే 12వ తరగతికి మొత్తం 121 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల షెడ్యూల్ ను అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఖరారు చేసినట్లు సీబీఎస్ఈ తెలిపింది. ఇందులో విద్యార్ధులకు పరీక్షల మధ్య గ్యాప్, పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధుల సంఖ్య, పరీక్ష కేంద్రాలు, ప్రధాన పోటీ పరీక్షల షెడ్యూల్స్ ఇలా పలు అంశాలు ఇందులో ఉన్నట్లు తెలిపింది. ఈ పరీక్షల్లో రెండు సబ్దెక్టులు ఒకే రోజు రాసే విద్యార్ధుల్ని దృష్టిలో ఉంచుకుని డేట్ షీట్ల కోసం మొత్తం 40 వేల సబ్జెక్ట్ కాంబినేషన్లు పరిశీలించినట్లు కూడా బోర్డు పేర్కొంది.

పది, పన్నెండు తరగతుల బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు సంబంధించిన సమాచారాన్ని, వాళ్లు ఎంచుకున్న సబ్జెక్టుల సమాచారాన్ని స్కూళ్ల నుంచి తెప్పించుకున్నాకే , దాని ఆధారంగా ఈ షెడ్యూల్ ఖరారు చేసినట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. ఈ మేరకు బోర్డు పరీక్షల షెడ్యూల్ ను తిరిగి అన్ని సీబీఎస్ఈ పాఠశాలల ప్రిన్సిపాల్స్, హెడ్ ఆఫ్ ద స్కూల్స్ కు పంపారు. విద్యార్ధులకు పరీక్షలు ప్రశాంతంగా రాసేందుకు అనువుగా షెడ్యూల్ ఖరారు చేశామని, ఇందులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా పరీక్షలు రాయాలని సీబీఎస్ఈ కోరింది. ఈ ఏడాది పదో తరగతి బోర్డు పరీక్షల్ని 26.5 లక్షల మంది, 12వ తరగతి బోర్డు పరీక్షల్ని 19.8 లక్షల మంది విద్యార్ధులు రాస్తున్నట్లు సీబీఎస్ఈ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+