టాపర్లకు విజయ్ మర్చిపోలేని కానుక..! గోల్డ్ చైన్, నగదు బహుమతులు..!

తమిళనాడులో తొలిసారి అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రిగా పలు ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జోసెఫ్ విజయ్ (CM Vijay) ఇవాళ మరోసారి తనదైన మార్కు చూపారు. రాష్ట్రంలో 10, 12 తరగతులకు నిర్వహించే బోర్డు పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్ధుల్ని తనదైన శైలిలో సత్కరించారు. చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన టాపర్లను, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సత్కరించిన తీరు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంశలు అందుకుంటోంది.

విజయ్ సాయం కోరిన చంద్రబాబు..! రెస్పాన్స్ ఇదే..! నెక్ట్స్ లైన్ లో డీకే..!
విజయ్ సాయం కోరిన చంద్రబాబు..! రెస్పాన్స్ ఇదే..! నెక్ట్స్ లైన్ లో డీకే..!

రాష్ట్రంలో ఈ ఏడాది 10, 12 తరగతుల బోర్డు పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్యమంత్రి విజయ్ చెన్నైలో సత్కారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారికి బంగారు గొలుసులు బహూకరించారు. వీటితో పాటు నగదు బహుమతులు కూడా అందించారు. టీవీకే విద్యా పురస్కారాల ప్రదానోత్సవంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో.. విజయ్ స్వయంగా విద్యార్థులకు ధృవీకరణ పత్రాలను, నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అలాగే వారికి మెడలో తానే స్వయంగా బంగారు గొలుసులు వేశారు. దీంతో విద్యార్ధులు, వారి తల్లితండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

Tamil Nadu CM Vijay Gifts Gold Necklaces to Class 10 12 Board Exam Toppers
నిన్న విజయ్, ఇవాళ డీకే శివకుమార్- చంద్రబాబు అడగ్గానే కాదనకుండా..!
నిన్న విజయ్, ఇవాళ డీకే శివకుమార్- చంద్రబాబు అడగ్గానే కాదనకుండా..!

తాను రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకోవడానికి విద్యార్ధుల సంక్షేమం కూడా ఒక కారణమని సీఎం విజయ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యార్థులు తమ చదువుపై దృష్టి సారించాలని, ఆశయాలను సాధించుకోవాలని, అలాగే జీవితంలో స్థిరపడిన తర్వాత సమాజానికి తోడ్పడాలని వారికి సూచించారు. తాను రాజకీయాల గురించి మాట్లాడటానికి, ఓట్లు అడగటానికి లేదా పార్టీ గురించి చర్చించడానికి రాలేదని, ప్రస్తుతానికి విద్యార్ధులకు పార్టీ రాజకీయాలతో పని లేదని, బాగా చదువుకోవాలని, గొప్ప విజయాలు సాధించాలని, మీ జీవితాన్ని మార్చుకోవాలని సూచించారు. ఆ తర్వాత, మన సమాజం, మన తమిళనాడు గురించి ఆలోచించవచ్చన్నారు. విద్యకు, రాష్ట్ర భవిష్యత్తుకు ఉన్న సంబంధాన్ని వివరిస్తూ, విద్యార్థులపై వారి తల్లిదండ్రుల, సమాజం , తమిళనాడు రాష్ట్రం యొక్క ఆశలు ఉన్నాయని విజయ్ గుర్తు చేశారు. అలాగే, విద్యార్థులు తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని, ఎలాంటి కష్టాలు ఎదురైనా తమ లక్ష్య సాధనలో వెనకడుగు వేయకూడదని విజయ్ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+