భారత్‌తో యుద్ధమొస్తే పాక్‌కే సపోర్ట్.. ఇజ్రాయెల్ రబ్బీ వివాదాస్పద కామెంట్స్!
భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య దౌత్య, వ్యూహాత్మక సంబంధాలు ఎంతో బలంగా ఉన్నప్పటికీ.. ఒకవేళ భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే ఇజ్రాయెలీలు పాకిస్తాన్‌కే మద్దతు ఇవ్వాలంటూ ఇజ్రాయెలీ-అమెరికన్ యూదు ధార్మిక గురువు రబ్బీ యోసెఫ్ మిజ్రాచీ చేసిన వివాదాస్పద కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో అంతర్జాతీయంగా, ముఖ్యంగా భారతీయ నెటిజన్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
ఏకేశ్వరోపాసన వర్సెస్ విగ్రహారాధన నెపంతో కామెంట్స్
రబ్బీ యోసెఫ్ మిజ్రాచీ ఓ ఉపన్యాసంలో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌తో భారత్‌కు వ్యూహాత్మక సంబంధాలు, సైనిక పొత్తులు ఉన్నప్పటికీ.. పాకిస్తాన్ తమకు ప్రత్యర్థి దేశమే అయినప్పటికీ తమ మత గ్రంథం తోరా నియమాల ప్రకారం ఏకేశ్వరోపాసన పాటించే దేశాలకే మద్దతు ఇవ్వాలని కామెంట్ చేశారు. విగ్రహారాధనను తోరా అంగీకరించదని, అందుకే మతపరమైన కోణంలో పాకిస్తాన్ వైపే నిలబడాలని ఆయన వాదించారు. ఈ కామెంట్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ఓ తీవ్రవాద శైలి ఆలోచన అని, ఇజ్రాయెల్ సమాజంలో ఇలాంటి తీవ్రవాద మత నాయకులను ఎవరూ పట్టించుకోరని పలువురు నెటిజన్లు తిప్పికొట్టారు.

అసహనం వెళ్లగక్కడం ఇది తొలిసారేమీ కాదు!
గతంలోనూ రబ్బీ యోసెఫ్ మిజ్రాచీ హిందూ మత విశ్వాసాలు, ఆచారాలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. భారతీయ సంప్రదాయాలను అవమానించేలా మాట్లాడిన ఆయన కామెంట్లను అప్పట్లోనే యూదు సమాజంలోని నైతికవాదులు, సాధారణ ఇజ్రాయెలీ పౌరులు ఖండించారు.
భారత నెటిజన్ల ధీటైన సమాధానం
ఈ వీడియో వైరల్ అయినప్పటికీ.. భారతీయ సోషల్ మీడియా వినియోగదారులు ఎంతో పరిణతితో స్పందించారు. " ఇతనొక మూల పడి ఉండే తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తి. ఇజ్రాయెల్ పౌరులు భారతీయులతో ఎంతో ఆప్యాయంగా ఉంటారు. వేల మంది ఇజ్రాయెలీలు భారత్ కు వచ్చి మన సంస్కృతిని గౌరవిస్తారు" అని కామెంట్లు చేశారు. ఒకరిద్దరు మతోన్మాదులు చేసే వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహబంధాన్ని దెబ్బతీయలేవని స్పష్టం చేశారు.
Rabbi Yosef Mizrachi explains why Jews✡️ should side with Pakistan over India if the two countries go to war. 🇵🇰🇮🇳🤯Yet Israel🇮🇱 is considered a close friend of our establishment🪖.What kind of friendship is this? https://t.co/WmQnIwgFtR
— Angeli Sharma 🇮🇳 (@realAngelii) November 5, 2026














Click it and Unblock the Notifications
