Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తులారాశి, వృశ్చిక రాశి మే నెల జాతక ఫలం

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ కొన్ని రాశులపై అత్యధిక ప్రభావాన్ని చూపుతాయి. మే నెలలో తులా రాశి, వృశ్చిక రాశివారి జాతక ఫలం ఎలా ఉందనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం. అయితే మీ వ్యక్తిగత జాతకంలోని దశలు, అంతర్దశల బట్టి ఫలితాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

తులా రాశి

మే నెల తులా రాశి వారికి మిశ్రమ ఫలితాలనిస్తుంది. కొన్ని రంగాల్లో విజయం వరించినప్పటికీ, మరికొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. పరాజయం కూడా పలకరిస్తుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. వ్యాపారస్తులకు లాభాలు సామాన్యంగా ఉంటాయి. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. కొంతకాలం ఆగాలి. ఖర్చులు పెరగవచ్చు. అనవసరపు వస్తువులపై డబ్బు ఖర్చు కాకుండా చూసుకోవాలి. పాత బాకీలు వసూలు కావడంలో జాప్యం జరుగుతుంది. ఓర్పు వహించాలి. కీళ్ల నొప్పులు లేదా ఉదర సంబంధిత నొప్పులు వేధిస్తాయి. కొన్ని ఆహార నియమాలు పాటించడం చాలా మంచిది. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి మనస్పర్థలు రావచ్చు. ఓపికతో వ్యవహరిస్తే సమస్యలు సద్దుమణుగుతాయి. శుభకార్యం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. శుక్రవారం రోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం లేదా అమ్మవారికి తెల్లని పుష్పాలతో పూజ చేయడం మేలు చేస్తుంది.

Horoscope Predictions and results for these two signs libra and scorpio for the month of may

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి మే నెల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరే సూచనలు కనపడుతున్నాయి. వృత్తిపరంగా అద్భుతమైన మార్పులు చూస్తారు. ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతాల పెంపు ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు అందుతాయి. వాహనం లేదా ఇల్లు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పాత అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అయితే, ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+