Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !!

రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన ఓ సాధారణ ఇస్త్రీ కార్మికుడికి రూ. 598 కోట్ల భారీ ఆదాయపు పన్ను నోటీసు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అతని పోగొట్టుకున్న పాన్‌ కార్డును భారీ వజ్రాల వ్యాపార లావాదేవీలకు దుర్వినియోగం చేశారని ఆ నోటీసులో పేర్కొనబడింది. ఇస్త్రీ పనిచేసే వ్యక్తికి ఇంత పెద్ద ఆస్తులుండటం ప్రశ్నార్థకంగా మారింది. రామ్‌నగర్‌లోని నాలా పక్కన ఇస్త్రీ చేస్తూ జీవనం సాగిస్తున్న జితేంద్ర కుమార్‌ బడోలియాకు ఈ షాకింగ్‌ నోటీసు అందింది.

ఆదాయపు పన్ను శాఖ భారీ ఆర్థిక లావాదేవీలను అంచనా వేసి ఈ నోటీసు విడుదల చేసింది. అయితే, జితేంద్రకు ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు లేదా వ్యాపారం ఉన్నట్లు అస్సలు తెలియదని స్పష్టం అయ్యింది. న్యాయవాదిని సంప్రదించిన తర్వాతే అసలు నిజం వెలుగులోకి వచ్చినట్టు చెబుతున్నారు. రాజస్థాన్‌లోని పాలికి చెందిన శత్రుఘ్నన్‌ అనే వ్యాపారి జితేంద్ర పోగొట్టుకున్న పాన్‌ కార్డును దుర్వినియోగం చేసినట్లు తేలింది. శత్రుఘ్నన్‌ దాన్ని ఉపయోగించి వజ్రాల వ్యాపారంలో భారీ లావాదేవీలు నిర్వహించాడని గుర్తించారు. బాధితుడు జితేంద్ర ఫిర్యాదు మేరకు గుంజ్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై కేసు నమోదు చేశారు.

iron-shop-man-from-ajmer-in-rajsthan-got-huge-income-tax-notice-of-598-crores-rupees-create-stir-acr

న్యాయవాది రాకేశ్‌ థడా మాట్లాడుతూ.. 2026 ఏప్రిల్ 1న ఆదాయపు పన్ను శాఖ జితేంద్ర బడోలియాకు రూ. 5,98,50,27,726 మొత్తానికి నోటీసు జారీ చేసిందని వివరించారు. ఈ మొత్తాన్ని బకాయి ఆదాయపు పన్నుగా నోటీసులో పేర్కొన్నారు. అతని పేరు మీద అక్రమంగా జి.ఎస్.టి. నంబర్ కూడా పొందినట్లు తెలిసింది. చట్టపరమైన పరిశీలన, ఆదాయపు పన్ను శాఖ విచారణలో జితేంద్ర పాన్‌ కార్డు గతంలో పోయిందని రుజువైంది. దానిని ఉపయోగించి శత్రుఘ్నన్‌ సింగ్, వజ్రాలు, ఆభరణాల వంటి విలువైన వస్తువుల వ్యాపార లావాదేవీలు పెద్ద ఎత్తున నిర్వహించాడని ఆరోపణలు వెలువడ్డాయి.

2020 డిసెంబర్ 9 నుండి 2021 ఫిబ్రవరి 9 మధ్య, కేవలం మూడు నెలల్లో రూ. 468 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు న్యాయవాది థడా వివరించారు. మొత్తం కేసు విలువ రూ. 598 కోట్లకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. ఆదాయపు పన్ను శాఖ నోటీసుపై త్వరలో చట్టపరమైన సమాధానం ఇస్తామని థడా తెలిపారు. జితేంద్ర తన తల్లిదండ్రుల నుండి విడిపోయి, రోజుకు సుమారు రూ. 500-700 సంపాదిస్తూ ఇస్త్రీ పనులు చేస్తూ జీవిస్తున్నానని చెప్పాడు. తన పాన్‌ కార్డు కొన్నేళ్ల క్రితం పోయిందని, దాని దుర్వినియోగంతో బ్యాంకు ఖాతాలు తెరిచి, జీఎస్టీ నంబర్ పొంది, కోట్లాది రూపాయల లావాదేవీలు జరిపారని ఆవేదన వ్యక్తం చేశాడు.

గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ రాజేంద్ర ప్రసాద్‌ ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను స్వీకరించారు. పాన్‌ కార్డు దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయని తమకు ఫిర్యాదు అందిందని ఆయన తెలిపారు. అనా సాగర్‌ పోలీస్‌ అవుట్‌పోస్ట్‌ ఇంఛార్జిగా కూడా ఉన్న రాజేంద్రకే దర్యాప్తు అప్పగించారు. జితేంద్ర తాను కేవలం ఇస్త్రీ చేసి జీవిస్తున్నానని, తనకు ఇతర వ్యాపారాలు లేవని తేగేసి చెప్పాడు. ఈ వ్యవహారంపై పోలీసులు సంబంధిత బ్యాంకులకు నోటీసులు పంపనున్నారు. ఈ షాకింగ్‌ ఘటనపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+