వరలక్ష్మీ వ్రతం స్పెషల్ తీపి అప్పాలు.. ఇలా చేస్తే బాగుంటాయి

శ్రావణ మాసంలో పండుగలు, పూజలు, ప్రత్యేక సందర్భాల్లో తీపి అప్పాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా మంది తీపి అప్పాలను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం చేసేవాళ్ళు వ్రత నైవేద్యాలలో తీపి అప్పాలు పెడతారు. ఈ తీపి అప్పాలను ఎలా తయారు చెయ్యాలో ఒకసారి చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు

బియ్యం పిండి - 1 కప్పు
బెల్లం - ¾ నుంచి 1 కప్పు (మీకు కావాల్సిన తీపి మేరకు)
నీళ్లు - ½ కప్పు (బెల్లం కరిగించడానికి)
ఏలకుల పొడి - ½ టీస్పూన్
నూనె - అప్పాలు వండటానికి
బెల్లం బదులు చక్కెర వాడవచ్చు
కొద్దిగా నువ్వులు లేదా కొబ్బరి పొడి కలపవచ్చు

Know how to make authentic Sweet Appalu Theepi Appalu at home Traditional Telugu festival sweet recipe

తయారీ విధానం

ఒక పాన్‌లో బెల్లం, నీళ్లు వేసి మరిగించండి. బెల్లం పూర్తిగా కరిగి లైట్ సిరప్ ఒక తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి. అందులో బియ్యం పిండి వేసి బాగా కలుపుతూ ముద్దలా తయారు చెయ్యండి.. అందులో ఏలకుల పొడి కూడా కలపండి. అందులోనే కాస్త నెయ్యి కూడా వేసి ముద్దలా కలుపుకోండి. ఇది చాలా గట్టిగా లేదా చాలా పల్చగా ఉండకూడదు. 10-15 నిమిషాలు పక్కన పెట్టండి.

అప్పాలు ఇలా చేస్తే బెస్ట్

తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలు తీసుకుని చేతితో నొక్కి చదునైన అప్పాలు చేయండి. మధ్యలో కొద్దిగా మందంగా, అంచులు పల్చగా ఉండేలా చేయండి. పాన్‌లో నూనె వేడి చేసి మీడియం ఫ్లేమ్‌పై అప్పాలు వేయించండి. రెండు వైపులా బంగారు రంగు వచ్చేలా మెల్లగా వేయించండి. స్టవ్ హై లో ఉంటే లోపల పచ్చిగా ఉండి బయట మాత్రమే కాలిపోతాయి కాబట్టి ఫ్లేమ్ మీడియంగా ఉంచండి.

గోంగూర టమాటా శనగపప్పు కూర... ఇలా వండితే అన్నం మెతుకు మిగలదు!
గోంగూర టమాటా శనగపప్పు కూర... ఇలా వండితే అన్నం మెతుకు మిగలదు!

అమ్మవారికి వరలక్ష్మీ వ్రతం రోజు నైవేద్యంగా అప్పాలు

కాలిన తర్వాత టిష్యూ పేపర్ మీద వేసి అదనపు నూనె తీసేయండి. వీటిని అమ్మవారికి వరలక్ష్మీ వ్రతం రోజు నైవేద్యంగా పెడితే, ఇంటికి వచ్చిన ముత్తయిదువులకు తినటానికి ప్రసాదంగా పెడితే బాగుంటుంది. ఇలా చేసిన అప్పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్‌టైట్ కంటైనర్‌లో ఉంచితే 4-5 రోజులు నిల్వ ఉంటాయి. అయితే ఆ అప్పాలు రుచిగా, మెత్తగా రావాలంటే పిండి ఎంత మెత్తగా ఉంటే అప్పాలు అంత మెత్తగా వస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+