భారత్ కు సడెన్ షాక్ ఇచ్చిన పాకిస్థాన్.. రూ. వేల కోట్లలో నష్టం..
భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టుల్ని ఉగ్రమూకలు దారుణంగా కాల్చి చంపాయి. దాంతో పాకిస్థాన్ పై భారత్ మే 7 నుంచి 10 వ తారీఖు వరకు ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. అలాగే సింధూ నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని కూడా నిలిపివేసింది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నుంచి ఇరు దేశాల మధ్య వైమానిక సేవలు నిలిచిపోయాయి. పాకిస్థాన్ విమానాలకు భారత గగనతలం మూసివేస్తూ ఉండగా.. అటు భారత విమానాలకు పాకిస్థాన్ గగనతలం మూసివేస్తోంది. ఏడాదికిపైగా ఈ విధానం కొనసాగుతూ వస్తోంది. అయితే తాజాగా భారత్ విషయంలో పాకిస్థాన్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.
భారత విమానాలకు పాకిస్థాన్ గగనతలం మూసివేతను మరోసారి పొడిగించింది. ఈ మేరకు సెప్టెంబర్ 24 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాకిస్థాన్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ నోటమ్ జారీ చేసింది. ఈ పొడిగింపు ఆగస్టు 23 ఉదయం 10 గంటల 15 నిమిషాల నుంచి సెప్టెంబర్ 24 సాయంత్రం 4 గంటల 59 నిమిషాల వరకూ అమల్లో ఉండనుంది. భారత విమానాలపై గతంలో ఇచ్చిన పొడిగింపు తేదీ ఆగస్టు 23 న ముగుస్తున్న నేపథ్యంలో తాజాగా మరోసారి ఆ గడువును పొడిగిస్తూ నోటీస్ టూ ఎయిర్ మెన్(నోటమ్) ను జారీ చేసింది. 2022 లోని పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకారం.. పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ రెండు విభాగాలుగా ఉన్నాయి. అవి కరాచీ, లాహోర్.. ఈ నోటమ్ కరాచీ.. లాహోర్ కు అప్లికేబుల్ అవుతుంది.

ఇక గతేడాది నుంచి భారత్ విమానాలకు పాకిస్థాన్ తన గగనతలాన్ని నిషేధిస్తూ వస్తుంది. ప్రతి నెలా ఈ గడువును పొడిగిస్తూ వస్తోంది. దాంతో భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు.. అలాగే ఇతర దేశాల నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికులకు విమాన రవాణా ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. తాజా నిర్ణయంతో మరోసారి భారత్ కు ఆర్థికంగా నష్టం వాటిల్లే విధంగా పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications