టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాకు అరెస్ట్ వారెంట్ జారీ

టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాకు అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని పశ్చిమ్ బెంగాల్ లోని నదియా జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. భారత ఆర్మీపై ఆమె చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో పదేపదే సమన్లు ​​జారీ చేసినా ఆమె కోర్టుకు హాజరు కాలేదు. దాంతో అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కృష్ణ నగర్ కోర్టు ఆదేశించింది. అరెస్ట్ వారెంట్ కు సంబంధించిన నివేదికను ఆగస్టు 28న తమకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. పదేపదే సమన్లు ​​జారీ చేసినప్పటికీ మొయిత్రా గైర్హాజరును కోర్టు తీవ్రంగా పరిగణించింది.

మహువా మోయిత్రా.. కోర్టు ఆదేశాలను వరుసగా ధిక్కరించడం, కోర్టు ఆదేశాలను పాటించడంలో ఆమె నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం తప్ప ఈ కోర్టుకు వేరే మార్గం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఇదే విషయంపై మొయిత్రా తరఫు న్యాయవాది.. ఆమె ఎప్పటికీ కోర్టుకు హాజరయ్యే అవకాశం లేదని చెప్పారని. ఈ విధంగా చూస్తే ఆమెకు న్యాయస్థానం పట్ల గౌరవం లేదని స్పష్టమవుతోందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో తెలిపారు. ఇక మహిళలను అవమానించారని, విద్వేషపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలపై మహువా మొయిత్రాపై గతంలో కేసు నమోదైంది.

MahuaMoitra Bengal court issues arrest warrant forTMC MP Bengal court issues arrest warrant TMC MP

ఓ సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. భారతీయ చట్టంలోని 79, 196, 299, 351, 353(2) తదితర సెక్షన్ల కింద మహువా మొయిత్రాపై ఫిర్యాదు నమోదైంది. ఇందులో మహిళల గౌరవానికి భంగం కలిగించడం.. వర్గాల మధ్య శత్రుత్వం ప్రేరేపించడం.. మతపరమైన భావనలను దెబ్బతీయడం, నేరపూరిత బెదిరింపులకు సంబంధించిన అభియోగాలు ఉన్నాయి. ఈ మేరకు రెస్ట్ వారెంట్ అమలుకు సంబంధించిన నివేదికను ఆగస్టు 28న సమర్పించాలని కృష్ణ నగర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+