చారిత్రక కట్టడాలను కాపాడే దిశగా పాతబస్తీ మెట్రో అలైన్మెంట్ మార్పులు!

హైదరాబాద్ మెట్రో హైదరాబాద్ నగర వాసుల రవాణా అవసరాలను తీరుస్తూ ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు దోహదం చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రోను విస్తరించి మరింత మెరుగైన సేవలు అందించాలని తెలంగాణా సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలో మెట్రోను స్వాధీనం చేసుకోవటంతో పాటు మెట్రో విస్తరణపైన రుష్టి సారించింది. ఈ క్రమంలో పాతబస్తీలో నిర్మాణం కానున్న మెట్రో కారిడార్-6లో ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి.

ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో ఆరు స్టేషన్లు ఉండనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఈ మార్గం అలైన్‌మెంట్‌ను మళ్లీ సమీక్షించి, తక్కువ ఖర్చుతో, చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం లేకుండా కొత్త డిజైన్లు తయారు చేయాలని నిర్ణయించింది. గతంలో కొన్ని ప్రాంతాల్లో భూమి సేకరణ కష్టమని అనుకుని, రహదారి మధ్యలో పిల్లర్లు వేయలేని చోట్ల ప్రత్యేక పోర్టల్ నిర్మాణాలు ప్రతిపాదించారు.

Hyderabad Old City Metro Alignment to Be Revised to Cut Costs and Protect oldest Heritage Sites

అలాంటి పోర్టల్స్ 30కి పైగా ఉండటంతో ప్రాజెక్టు ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఇటీవల కొన్ని క్లిష్టమైన ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవడంతో పరిస్థితి మారింది. దీంతో ఇప్పుడు మెట్రో సెంటర్‌లైన్‌ను రహదారి మధ్యకు దగ్గరగా తీసుకెళ్లి, పోర్టల్స్ సంఖ్యను తగ్గించే అవకాశం ఏర్పడింది.

చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం వంటి ప్రాంతాల్లో చారిత్రక కట్టడాలకు దగ్గరగా నిర్మాణాలు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించనున్నారు. దీనికోసం అలైన్‌మెంట్ ఆప్టిమైజేషన్ పనిని ప్రత్యేక సంస్థకు అప్పగించేందుకు హెచ్‌ఏఎంఎల్ సీల్డ్ కొటేషన్లు కోరింది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,935 కోట్లు కాగా, కొత్త డిజైన్లు వచ్చిన తర్వాతే ఎంత ఆదా అవుతుందో తెలుస్తుంది. జనరల్ కన్సల్టెన్సీ టెండర్ల గడువును కూడా అక్టోబరు 8 వరకు పొడిగించారు.

తెలంగాణకు వరుణుడి హెచ్చరిక: రానున్న రెండు రోజులు ఈ జిల్లాలలో భారీ వర్షాలు!
తెలంగాణకు వరుణుడి హెచ్చరిక: రానున్న రెండు రోజులు ఈ జిల్లాలలో భారీ వర్షాలు!

మొత్తం సుమారు 888 ఆస్తుల్లో 90%కి పైగా సేకరణ పూర్తయింది. మిగిలిన కొన్ని ఆస్తులు వక్ఫ్, కోర్టు వివాదాలు ఉన్నవి. రహదారి విస్తరణ, యుటిలిటీల మార్పిడి పనులు కూడా కొనసాగుతున్నాయి.పాతబస్తీ ప్రజలకు మెట్రో సౌకర్యం అందుబాటులోకి రావడం కోసం అధికారులు వేగంగా పనులు చేపడుతున్నారు. అందులో భాగంగానే అలైన్మెంట్ మారుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+