2,500 ఏళ్ల నాటి 'బంగారు కళ్ల' కిరీటం, దుష్టశక్తి భయంకరమైన నిజాలు!
ఒక నాగరికత ఆనవాళ్లు దొంగల పాలై కరిగిపోతాయేమోనన్న భయం.. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన యుద్ధం.. చివరకు ఒక రహస్య ఒప్పందంతో సుఖాంతమైన ఈ ఉత్కంఠ కథ ఇప్పుడు ముగింపు దశకు చేరింది. నెదర్లాండ్స్‌లోని డ్రెంట్స్ మ్యూజియం నుంచి గతేడాది చోరీకి గురైన రొమేనియా జాతీయ నిధి 'కొటోఫెనెస్టి' (Cotofenesti) బంగారు హెల్మెట్ ఎట్టకేలకు లభ్యమైంది. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన ఈ అరుదైన కిరీటాన్ని భారీ పోలీసు బందోబస్తు మధ్య డచ్ అధికారులు మీడియా ముందుకు తీసుకొచ్చారు.
మ్యూజియంలో పేలుడు.. ఆ రాత్రి ఏం జరిగింది?
2025 జనవరిలో ఒక అర్ధరాత్రి.. డ్రెంట్స్ మ్యూజియం నిశ్శబ్దంగా ఉంది. ముగ్గురు దొంగలు అత్యంత పక్కా ప్లాన్‌తో లోపలికి చొరబడ్డారు. సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. వారు కేవలం తలుపులు బద్దలు కొట్టడమే కాదు, సొంతంగా తయారు చేసుకున్న బాంబులతో ప్రదర్శన శాలను పేల్చివేశారు. పొగ మంచులా కమ్మేసిన సమయంలో, సుమారు 60 కోట్ల రూపాయల విలువైన బంగారు కిరీటం మరియు మూడు బంగారు మణికట్టు పట్టీలను (Bracelets) ఎత్తుకెళ్లి చీకట్లో కలిసిపోయారు.

కరిగిపోతుందా? కనుమరుగవుతుందా?
చోరీ జరిగిన వెంటనే అంతర్జాతీయ స్థాయిలో అలర్ట్ జారీ అయింది. ఈ హెల్మెట్ స్వచ్ఛమైన బంగారంతో తయారవ్వడం ఒక ఎత్తు అయితే, దీనిపై ఉన్న అద్భుతమైన కళాకృతుల వల్ల దీనిని బ్లాక్ మార్కెట్‌లో అమ్మడం అసాధ్యం. దీంతో దొంగలు దానిని కరిగించి ముక్కలు చేస్తారేమోనని చరిత్రకారులు వణికిపోయారు. రొమేనియా న్యాయశాఖ మంత్రి ఈ చోరీని "దేశంపై జరిగిన నేరం" గా అభివర్ణించడంతో నెదర్లాండ్స్ పోలీసులపై ఒత్తిడి తారాస్థాయికి చేరింది.
పోలీసుల మాస్టర్ ప్లాన్: దొంగలతో 'సీక్రెట్ డీల్'!
కేసు దర్యాప్తులో భాగంగా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు కానీ, వారి వద్ద బంగారం దొరకలేదు. ఇక్కడే డచ్ పోలీసులు ఒక తెలివైన ఎత్తుగడ వేశారు. నిందితులతో 'ప్లీ డీల్' (శిక్ష తగ్గింపు ఒప్పందం) కుదుర్చుకున్నారు. "బంగారం ఎక్కడుందో చెబితే మీ శిక్షను తగ్గిస్తాం" అన్న ఆఫర్‌కు దొంగలు లొంగిపోయారు. అలా ఒక రహస్య ప్రదేశంలో దాచిన ఈ బంగారు నిధిని పోలీసులు రికవరీ చేశారు. కిరీటంతో పాటు రెండు మణికట్టు పట్టీలు కూడా దొరికాయి, మూడవ దాని కోసం గాలింపు కొనసాగుతోంది.
అసలు ఏమిటా 'కొటోఫెనెస్టి' రహస్యం?
ఈ కిరీటం కేవలం విలాసం కోసం కాదు, అది ఒక అద్భుత రక్షణ కవచం:
- నాగరికత: ఇది క్రీస్తు పూర్వం 500 ఏళ్ల నాటి 'డాసియా' నాగరికతకు చెందిన రాజులు ధరించే వారు.
- దుష్టశక్తి కవచం: ఈ హెల్మెట్ పక్కన పెద్ద కళ్లు చెక్కబడి ఉంటాయి. రాజుకు అపాయం కలగకుండా ఈ 'కళ్లు' కాపలా కాస్తాయని నాటి ప్రజల నమ్మకం.
- బరువు: కేజీకి పైగా స్వచ్ఛమైన బంగారంతో తయారైన ఈ కిరీటంపై యుద్ధ వీరుల ఆకృతులు చెక్కబడి ఉన్నాయి.
మళ్ళీ తన ఇంటికి..
ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ఈ కిరీటంపై స్వల్పంగా నొక్కు పడినట్లు అధికారులు గుర్తించారు. "చిన్న దెబ్బ తగిలింది కానీ, దాన్ని పూర్వస్థితికి తీసుకురావచ్చు" అని మ్యూజియం డైరెక్టర్ రాబర్ట్ వాన్ లాంగ్ తెలిపారు. త్వరలోనే ఈ జాతీయ సంపదను రొమేనియా రాజధాని బుకారెస్ట్‌లోని నేషనల్ హిస్టరీ మ్యూజియంకు అప్పగించనున్నారు. దీంతో 2,500 ఏళ్ల నాటి ఒక అద్భుత చరిత్ర మళ్ళీ తన సొంత గూటికి చేరుతోంది.
-
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
మన బంగారం మన దేశానికే! ఫ్రాన్స్ మాస్టర్ ప్లాన్ -
బంగారం ధరలపై అంచనాలు తలకిందులు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!!














Click it and Unblock the Notifications