"పాకిస్థాన్, బంగ్లాదేశ్ మళ్లీ భారత్ లో భాగం అవుతాయి"
ప్రముఖ యోగ గురువు రామ్ దేవ్ బాబా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దేశంలో జరుగుతున్న సమస్యలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పేపర్ లీక్, విద్య వ్యవస్థపై ఇటీవల రామ్ దేవ్ బాబా మాట్లాడారు. పోటీ పరీక్షల నియామకాల్లో ఇంటర్వ్యూల సమయంలోనే 90 శాతానికి పైగా అవినీతి జరుగుతోందని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాలు ఏదో ఒక రోజు భారత్ లో అంతర్భాగమవుతాయని అన్నారు. అయితే అందుకు సహనంతో ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం పాకిస్థాన్ తో భారత్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రాయ్ పూర్ లోని స్వామి వివేకానంద అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని హిందూ మతం, క్రైస్తవ, ఇస్లాం మతాలకు ఎలాంటి ముప్పు లేదని తెలిపారు. కానీ భారత్ గౌరవం, స్పూర్తి మాత్రమే ఆపదలో ఉన్నాయని స్పష్టం చేశారు. పాకిస్థాన్ లోని హిందువుల పరిస్థితిపై పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలకు ఆయన బదులిచ్చారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ లోని హిందువులపై దాడులు, వివక్ష జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులను అలా బాధిస్తున్న వ్యక్తులే హిందువులపై మాట్లాడడం మానేయాలని అన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాలు ఏదో ఒక రోజు భారత్ లో విలీనం అవుతాయని కానీ కొంత సమయం పాటు వేచి చూడాలని కోరారు.

రాజకీయ పోరులో భాగంగానే దేశంలో మతమార్పిడి, మతమార్పిడి చట్టాలు పుట్టుకొస్తున్నాయని రామ్ దేవ్ బాబా స్పష్టం చేశారు. భారత్ లో ఇతర మతాలకు ఎలాంటి ప్రమాదం లేదని.. భారత గౌరవానికే ప్రమాదం వాటిల్లుతోందని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలవాలని తన కల అని రామ్ దేవ్ బాబా తెలిపారు. ప్రపంచంలోనే గొప్ప పౌరులుగా భారత పౌరులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications