చర్లపల్లి నుంచి నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్- హాల్ట్ స్టేషన్లు
వివిధ నగరాల మధ్య నెలకొంటోన్న ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. తరచూ వేర్వేరు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను తరచూ ప్రకటిస్తూ వస్తోన్నారు. తాకిడికి అనుగుణంగా గతంలో ప్రకటించిన పలు ప్రత్యేక రైళ్లను కూడా పొడిగిస్తోన్నారు. ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు అవన్నీ కూడా. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉంటోన్నాయి.
ఈ క్రమంలో ఓ నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కబోతోంది. చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించబోతోంది. దీనికి సంబంధించిన వివరాలు సైతం వెలువడ్డాయి. చర్లపల్లి నుంచి ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ మధ్య ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లకు మెరుగైన కనెక్టివిటీని కల్పించబోతోందీ నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీన ఈ రైలు ప్రారంభం కానుంది.

దీంతో సికింద్రాబాద్, కాచిగూడ నుంచి ఇప్పటివరకు ఆరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ లు అందుబాటులో ఉన్నట్టవుతుంది. తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించే రైలును కూడా పరిగణనలోకి తీసుకుంటే వీటి సంఖ్య ఏడుకు పెరుగుతుంది.
అక్టోబర్ 2వ తేదీన శుక్రవారం రాత్రి 11:28 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 22075 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రెండో రోజు అంటే ఆదివారం తెల్లవారు జామున 6:25 నిమిషాలకు గోరఖ్ పూర్ కు చేరుకుంటుంది.
అక్టోబర్ 4వ తేదీ ఆదివారం ఉదయం 8:30 గంటలకు గోరఖ్ పూర్ నుంచి బయలుదేరే నంబర్ 22076 అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్.. మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
ఖాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల, బల్లార్షా, చంద్రాపూర్, నాగ్ పూర్, బేతుల్, ఇటార్సీ, భోపాల్, బీనా, వీజీఎల్ ఝాన్సీ, అరై, పొఖ్రయాన్, కాన్పూర్ సెంట్రల్, ఐష్ బాగ్, లక్నో సిటీ, గోమతీ నగర్, బారాబాంకీ, గోండా మీదుగా ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగిస్తుంది.













Click it and Unblock the Notifications