రిలీజైన మూడు వారాల్లోనే ఓటీటీలోకి స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి సినిమాలకు అటు తమిళంతోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆవారా మూవీ నుంచి ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అందువల్ల కార్తి ప్రతి సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ అదే రోజు రిలీజ్ అవుతుంది. ఇక ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలనే నమోదు చేశాయి. అయితే ఇటీవల రిలీజైన సర్దార్ 2 మూవీ ప్రేక్షకులను కాస్త నిరాశ పరిచింది. 2023 లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'సర్దార్' ఇది సీక్వెల్ గా తెరకెక్కింది.
అయితే సెప్టెంబర్ 10 న వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆశించినంత విజయం సాధించలేకపోయింది. దాంతో ఈ మూవీ రిలీజ్ అయిన మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా అక్టోబర్ 1 వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను అమెజాన్ ప్రైమ్ తాజాగా వెల్లడించింది.
థియేటర్లలో పెద్దగా విజయం సాధించని సర్దార్ 2 మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఏ విధంగా ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుందో చూడాలి. వాస్తవానికి ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి పార్ట్ సర్దార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో ఈ సీక్వెల్ పై కార్తి ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ మూవీ అనూహ్యంగా ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీకి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ మూవీలో కార్తి సరసన మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. అలాగే ఈ మూవీలో కోలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య విలన్ పాత్రలో కనిపించారు.

సర్దార్ 2 మూవీ స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో కార్తి ఓ స్పై పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో తండ్రీకొడుకులుగా కార్తి డ్యూయల్ రోల్ చేశారు. రా ఏజెంట్ చంద్రబోస్ అలియాస్ సర్దార్ గా, ఇన్ స్పెక్టర్ విజయ్ ప్రకాష్ గా అలరించారు. ఇక ఈ మూవీని ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లపై ఎస్ లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా సంయుక్తంగా నిర్మించారు. అలాగే సామ్ సీఎస్ సంగీతం అందించారు. ఇక సర్దార్ 2 సినిమాను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications
