టోల్ ప్లాజాల్లో ఆగే పని లేదు.. మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో సిస్టమ్!
వాహనదారులకు బిగ్ అలెర్ట్. వాహనదారులు నేషనల్ హైవేల మీద ప్రయాణం చెయ్యాలంటే టోల్ గేట్ల వద్ద తప్పనిసరిగా ఆగి టోల్ చార్జీలు చెల్లించవలసిందే.కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండానే నేషనల్ హైవే మీద ప్రయాణం చేసే అవకాశం కల్పించనుంది ఎన్ హెచ్ ఏ ఐ.
తెలంగాణలో టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా కొత్త మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ విధానం రాబోతోంది. దేశంలోనే కాదు, తెలంగాణా రాష్ట్రంలోని 11 టోల్ ప్లాజాల్లో ఈ వ్యవస్థను అమలు చేయనున్నారు. ఈ మేరకు దీని కోసం టెండర్ ప్రక్రియ మొదలైంది. రాబోయే ఆరు నెలల్లో పూర్తిగా ఇది అందుబాటులోకి రావచ్చు.

ఈ కొత్త పద్ధతిలో టోల్ బూత్‌లు ఉండవు. ప్రతి లేన్‌పై గ్యాంట్రీలు ఉంటాయి. వాటిపై RFID రీడర్లు, నంబర్ ప్లేట్ గుర్తించే ఆటోమేటిక్ కెమెరాలు, రాడార్, సెన్సార్లు, లిడార్ వంటి పరికరాలు ఉంటాయి. వాహనం గ్యాంట్రీ కింద నుంచి వెళ్లగానే ఫాస్టాగ్ లేదా నంబర్ ప్లేట్ స్కాన్ అవుతుంది. సమాచారం జాతీయ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్‌కు వెళ్లి ఆటోమేటిక్‌గా టోల్ కట్ అవుతుంది.
ఈ మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ విధానంలో ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ లేకపోయినా వాహనం ఆగదు. కెమెరాలు నంబర్ ప్లేట్ చదివి టోల్ వసూలు చేస్తాయి. బ్యాలెన్స్ ఉంటే 24 గంటల్లో రీఛార్జ్ చేసుకుని చెల్లించవచ్చు. లేకపోతే ఈ-నోటీస్ వస్తుంది. ఈ వ్యవస్థ ముందుగా గుజరాత్‌లోని ఎన్‌హెచ్-48పై ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది.
ఇప్పుడు ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్రతో పాటు తెలంగాణలోనూ దశలవారీగా విస్తరిస్తున్నారు. ఈ విధానంలో ముఖ్యంగా వాహనదారులకు టోల్ గేట్ల వద్ద సమయం ఆదా అవుతుంది. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్‌లు తగ్గుతాయి. ప్రయాణం మరింత సులభంగా, వేగవంతంగా అవుతుంది. టోల్ ఫీజులు కట్టకున్నా సరే ఎక్కడ ఆగకుండా ప్రయాణం చేసే ఈ సౌకర్యం అతి త్వరలో తెలంగాణా రాష్ట్రంలో అందుబాటులోకి రానుంది. సెకన్ల వ్యవధిలోనే టోల్ పేమెంట్ అవుతుంది.













Click it and Unblock the Notifications
