AP Pensions: ఏపీలో పింఛన్ దారులకు మరో అప్డేట్- మళ్లీ మార్పు..!

ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ (Pensions) లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలాఖరులో బ్యాంక్ ఉద్యోగులు మూడు రోజుల పాటు సమ్మె చేపడతామని ప్రకటించిన నేపథ్యంలో అక్టోబర్ 1న ఇచ్చే పెన్షన్లను ఉదయానికి బదులు మధ్యాహ్నం పంపిణీ చేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అయితే ఇప్పుడు బ్యాంక్ ఉద్యోగులు తమ మూడు రోజుల సమ్మెను వాయిదా వేసుకున్నారు. దీంతో ఈసారి కూడా ఎప్పటిలాగే ఉదయాన్నే పెన్షన్లను సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇళ్ల వద్దే పంపిణీ చేయించబోతోంది.

ఏపీలో పింఛన్ దారులకు అలర్ట్..! బ్యాంకుల సమ్మె కారణంగా ఈసారి..!
ఏపీలో పింఛన్ దారులకు అలర్ట్..! బ్యాంకుల సమ్మె కారణంగా ఈసారి..!

గతంలో ప్రకటించినట్టుగా సవరించిన వేళలతో సంబంధం లేకుండా, ఎప్పటిలాగే అక్టోబర్ 1వ తేదీ ఉదయం 6:30 గంటల నుంచే లబ్ధిదారుల ఇంటి వద్దే పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు తమ సమ్మెను విరమించడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది లేక‌పోవ‌డంతో ముందస్తు ప్రణాళిక ప్రకారమే పింఛన్ల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 30వ తేదీనే స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు సిబ్బంది బ్యాంకుల నుంచి 100% పింఛను నగదును విత్‌డ్రా చేసుకుని.. అక్టోబ‌ర్ 1వ తేదీ ఉద‌యం నుంచే ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు వెళ్లి పింఛ‌న్ల న‌గ‌దు అంద‌జేస్తార‌ని తెలిపారు.

AP Pensions NTR Bharosa Payments disbursal on October 1 Morning after bank strike postponement
ఏపీలో పింఛన్ దారులకు అలర్ట్..! 9 లక్షల మందికి అకౌంట్లోనూ, నగదుగానూ..!
ఏపీలో పింఛన్ దారులకు అలర్ట్..! 9 లక్షల మందికి అకౌంట్లోనూ, నగదుగానూ..!

అక్టోబ‌ర్ నెల పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.2,692.34 కోట్లను విడుదల చేసిందని మంత్రి తెలిపారు. ఇందులో రూ.2,692.28 కోట్లను పంచాయతీ / వార్డుల ఖాతాలకు జమ చేయగా, రూ. 6 లక్షలను గజపతినగరం మండలంలోని NSAP పింఛనుదారుల ఖాతాలకు డీబీటీ ద్వారా జమ చేస్తార‌ని మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 30 నాటికి అవసరమైన నగదు సిద్ధంగా ఉండేలా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు , ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, SLBC, బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని 61.80 లక్షల మంది పింఛనుదారుల‌కు ప్ర‌తి నెలా 1వ తేదీనే పింఛ‌న్లు అందిస్తామని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+