ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026.. అదిరిపోయే ఆఫర్లు అప్పటి నుండే!

దసరా, దీపావళి పండుగలు వచ్చేస్తున్నాయి. అందరి ఇళ్ళలో సంతోషాల సంబరాలు తెస్తున్నాయి. మరి ఈ పండుగల వేళ అందరూ ఆశగా ఎదురు చూసే ఆఫర్ ల వేడుక ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 అధికారికంగా అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానుంది.

ప్రతీ సంవత్సరం లానే ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 ఫ్లిప్‌కార్ట్ ప్లస్, VIP, బ్లాక్ మెంబర్లకు 24 గంటల ముందే అక్టోబర్ 8 అర్ధరాత్రి నుంచి యాక్సెస్ లభిస్తుంది. ఈ పండుగ సీజన్ సేల్ కనీసం ఒక వారం పాటు కొనసాగే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లు ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చకు కారణం అవుతున్నాయి. కొత్తగా వచ్చిన ఐఫోన్ 17 సిరీస్‌పై భారీ తగ్గింపు ఉండనుంది.

Flipkart Big Billion Days Sale 2026 - Starts October 9 with huge offers and Big mobile Phone Discounts

బ్యాంక్ క్యాష్‌బ్యాక్, ఎక్స్‌ఛేంజ్ బోనస్ కలిపితే రూ.80,000 లోపు ధరకే లభించే అవకాశం ఉంది. మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్రోమోషనల్ ధర ₹36,999కు తగ్గుతుందని లీక్‌లు చెబుతున్నాయి.మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ప్రస్తుతం రూ.30,999 ఉంది. సేల్‌లో రూ.29,999కు లభిస్తుంది. ఎడ్జ్ 70 ప్రో 8జీబీ+256జీబీ మోడల్ రూ.39,999 నుంచి రూ.36,999కు తగ్గుతుంది. అంటే రూ.3 వేలు డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ ఏడాది లాంచ్ అయిన ప్రీమియం ఫోన్ మోటో సిగ్నేచర్ 12జీబీ+256జీబీ వేరియంట్ ప్రస్తుతం రూ.59,999 ఉంది. సేల్‌లో రూ.57,499కు అందుబాటులోకి రానుంది. గూగుల్ పిక్సెల్ 11పై కూడా భారీ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు కూడా రావచ్చు. బ్యాంక్ ఆఫర్లు కూడా అదిరిపోయేలా ఉండనున్నాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది.

టోల్ ప్లాజాల్లో ఆగే పని లేదు.. మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో సిస్టమ్!
టోల్ ప్లాజాల్లో ఆగే పని లేదు.. మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో సిస్టమ్!

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్‌తో పాటు ముందస్తు యాక్సెస్ కూడా ఉంటుంది. ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ప్రీమియం ఫోన్లపై పాత పరికరాలు ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే అదనపు వాల్యూ ఇస్తారు. కొత్త ఫోన్ లేదా ఏదైనా గ్యాడ్జెట్స్ కొనలనుకునేవారు ఈ సేల్‌ లో బాగా ప్లాన్ చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+