మహిళా రిజర్వేషన్లు సరిపోవు..! వారికి అవీ ఇవ్వండి.. సాయిరెడ్డి షాకింగ్ డిమాండ్..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో కీలకంగా వ్యవహరించి అనంతరం పార్టీ అధికారం కోల్పోయాక , పదవులకు , రాజకీయాలకు దూరమైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy).. ప్రస్తుతం దేశోద్ధారణ పనుల్లో బిజీగా కనిపిస్తున్నారు. ఓవైపు వ్యవసాయం చేసుకుంటూ, మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇస్తూ, ఇంకోవైపు అంతర్జాతీయ విషయాలపై తన అభిప్రాయాలు నిర్మొహమాటంగా వెల్లడిస్తూ సాయిరెడ్డి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

ఇదే క్రమంలో విజయసాయిరెడ్డి.. కేంద్రం త్వరలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై స్పందించారు. ఇప్పటికే పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లును అమలు చేసేందుకు వీలుగా కేంద్రం ఈ నెలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు సరిపోవంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా సాధికారత కోసం ఇంకేం చేయాలో రాజకీయ పార్టీలకు సూచించారు.

beyond reservations Vijayasai Reddy Demands Political Parties Elevate Women to Leadership Posts

లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు సీట్లు రిజర్వ్ చేయడమే కాకుండా, నమోదైన ప్రతి రాజకీయ పార్టీలోనూ నాయకత్వ పదవులలో మహిళలకు అధిక ప్రాతినిధ్యం ఉండేలా తప్పక చూడాల్సిన అవసరం ఉందని విజయసాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. పార్టీలలో మహిళలు నిర్ణయాధికార పాత్రలు పోషించి, ఎన్నికైన పదవుల్లోకి సజావుగా మారడానికి మెరుగ్గా సిద్ధపడినప్పుడే నిజమైన రాజకీయ సాధికారత సాధ్యమవుతుందని సాయిరెడ్డి వెల్లడించారు. అయితే ఈ ట్వీట్ ఆయన ఎవరిని ఉద్దేశించి పెట్టారో తెలియలేదు. గతంలో తాను పనిచేసిన వైసీపీలో ఒకప్పుడు విజయమ్మ గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. అలాగే సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ఇద్దరూ వ్యాపారాల్లో ఉన్నారు. వీరికి ఆయా పార్టీలు కీలక పదవులు ఇవ్వాలని సాయిరెడ్డి భావిస్తున్నారా అన్న చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+