ధనుస్సు రాశి, మకర రాశి మే నెల జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ కొన్ని రాశులపై అత్యధిక ప్రభావాన్ని చూపుతాయి. మే నెలలో ధనుస్సు రాశి, మకర రాశివారి జాతక ఫలం ఎలా ఉందనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం. అయితే మీ వ్యక్తిగత జాతకంలోని దశలు, అంతర్దశల బట్టి ఫలితాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి మే నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో విజయం సాధిస్తారు. కార్యాలయంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. తోటి ద్యోగులతో చిన్నపాటి విభేదాలు తలెత్తుతాయి. నిగ్రహంగా ఉంటే గొడవలు రావు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి నెల మధ్యలో అనుకూల వార్తలు అందుతాయి. ఆదాయం బాగుంటుంది కానీ అనవసర ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి.

విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచనలు మానుకోవాలి. పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి మద్దతు మీకు కొండంత అండగా నిలుస్తుంది. కంటి సమస్యలు లేదా ఎముకలకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. సరైన ఆహారం, నిద్ర అవసరం. గురువారం రోజున దక్షిణామూర్తిని ఆరాధించడం లేదా శనగలు దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది.
మకర రాశి
మకర రాశి వారికి ఈ నెల అభివృద్ధి పథంలో సాగుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఉద్యోగస్థులకు పదోన్నతి లేదా బదిలీ ఉంటుంది. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు పొందుతారు. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే ఆలోచన ఈ సమయంలోనే కార్యరూపం దాల్చుతుంది.
సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. బంధువుల రాకతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పాత అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం యోగా చేయడం మంచిది. శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల దోషాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి.












Click it and Unblock the Notifications