పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై రెండు వారాల దాడుల నిలిపివేతకు అంగీకరించడంతో ద్రవ్యోల్బణ భయాలు తగ్గాయి. దీని ప్రభావం బంగారం ధరలపై విపరీతంగా పడింది. ఒక్కసారిగా పసిడి రేట్లు ఝామ్మంటూ పైకి ఎగబాకాయి. ఒకేసారి మూడు వారాల గరిష్ట స్థాయికి చేరాయి. ఈ పరిణామాలతో ఇన్ని రోజులూ తీవ్ర హెచ్చుతగ్గులకు గురైన బంగారం, వెండి పెట్టుబడిదారులకు కొంత ఉపశమనం కలిగినట్టయింది.
అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ఔన్స్ 4,812.49 డాలర్లకు పెరిగింది. అంతకుముందు రోజుతో పోల్చుకుంటే ఇందులో 2.3 శాతం పెరుగుదల కనిపించింది. జూన్ డెలివరీ యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 3.4 శాతం మేర లాభపడి 4,841.60 డాలర్లకు చేరాయి. భారత్ లో బంగారం ధరల్లో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ 2.13 శాతానికి అంటే 3,161 రూపాయల మేర పెరిగింది.

10 గ్రాములకు రూ. 1,51,894 వద్ద ట్రేడయ్యింది. అదే సమయంలో మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా 5.01 శాతం లాభపడింది. వెండి ధర ఏకంగా 11,602 రూపాయల మేర ఎగబాకి, కిలోకు 2,42,950 రూపాయలకు చేరింది. మంగళవారం నాడు ఎంసీఎక్స్ మే గోల్డ్ ఫ్యూచర్స్ 0.33 శాతం లాభంతో 10 గ్రాములకు రూ. 1,48,900 వద్ద ముగిసింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ 1.11 శాతం నష్టపోయింది. కిలోకు రూ. 2,30,779కి తగ్గింది. ఇప్పుడు వీటన్నింటినీ మించి పోయాయి వీటి ధరలు. రికార్డుస్థాయికి చేరుకున్నాయి.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,491, 22 క్యారెట్లు - రూ. 14,200, 18 క్యారెట్లు - రూ. 11,860
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,382, 22 క్యారెట్లు- రూ. 14,100, 18 క్యారెట్లు - రూ. 11,537
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,382, 22 క్యారెట్లు- రూ. 14,100, 18 క్యారెట్లు - రూ. 11,537
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,382, 22 క్యారెట్లు- రూ. 14,100, 18 క్యారెట్లు - రూ. 11,537
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,382, 22 క్యారెట్లు- రూ. 14,100, 18 క్యారెట్లు - రూ. 11,537
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,382, 22 క్యారెట్లు- రూ. 14,100, 18 క్యారెట్లు - రూ. 11,537

Click it and Unblock the Notifications