ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!!

సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నోడికి ఎప్పుడూ అవకాశాలు దక్కుతూనే ఉంటాయి. అలా ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి వచ్చి తమ కాళ్ల మీద తాము నిలబడి ఉన్నత స్థాయిలో రాణిస్తున్నావాళ్లు చాలామందే ఉన్నారు. కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఆ కోవకు చెందినవాడే. ఒక్కో సినిమాతో అంచలంచలుగా ఎదుగుతూ వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు ప్రదీప్ రంగనాథన్..

వరుసగా మూడు సినిమాలు లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ తో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. తక్కువ సమయంలోనే తనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్నాడు. ప్రదీప్ రంగనాథన్ మూవీ వస్తుందంటే యువత ఎగబడి చూస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్ తో సినిమాలను తెరకెక్కించడం ఆయన స్పెషాలిటీ.. ఇక ఆయన తాజాగా నటించిన చిత్రం LIK ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది.

ఈ మూవీలో ప్రదీప్ రంగనాథన్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఎస్. జే . సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి విజ్ఞేన్ శివన్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ మూవీలో యోగిబాబు, సీమాన్, గౌరీ కిషన్, షారా, మాళవిక కీలక పాత్రల్లో మెరిశారు. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించారు. LIK మూవీని నయనతార, లలిత్ కుమార్ , ఎల్ కే విష్ణు కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేశాయి.

ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రివ్యూ షోను చెన్నైలోని కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు, మీడియా ప్రతినిధులకు వేసి చూపించారు. వాళ్లు సినిమా చూసిన తర్వాత ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 2040 నాటికి టెక్నాలజీ పీక్స్ లోకి వెళ్తుంది. మొబైల్ కు అడిక్ట్ అయిన ఓ అమ్మాయి.. యాప్స్ ను పిచ్చి పిచ్చిగా వాడేస్తూ ఉంటుంది. అయితే ఆ అమ్మాయిని చూసి ఓ కుర్రాడు తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. అయితే ప్రతీ ముఖ్యమైన విషయానికి ఇన్సూరెన్స్ చేసుకునే ప్రజలు.. ప్రేమకు ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకోరు.. ప్రేమకు కూడా ఇన్సూరెన్స్ ఉండాలని LIK అనే యాప్ ను సృష్టిస్తాడు ఓ ప్రముఖ వ్యక్తి.

LIK Movie First Review Pradeep Ranganathan Eyes Fourth Successive Hit Pradeep Ranganathan film

ఇక ఈ LIK యాప్ కు యువతలో క్రేజ్ భారీగా పెరుగుతుంది. ఇతన్ని లవ్ చేయొచ్చా..? మనకు తగినవాడు కాదా..? మోసం చేస్తున్నాడా..? వంటివి ముందే ఈ యాప్ అంచనా వేసి చెప్పేస్తుంది. ఇక హీరోయిన్ కూడా ఈ యాప్ ద్వారానే హీరోతో కనెక్ట్ అవుతుంది. అయితే ఓ రోజు హీరోయిన్ కు ఈ యాప్ లో హీరో మోసం చేశాడని చూపిస్తుంది. దాంతో ఇద్దరి మధ్య బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ లైన్. LIK మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఫుల్ రివ్యూ కోసం మరో మూడు రోజులు ఆగాల్సిందే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+