సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..!
బాదంపాలు చాలా రుచిగా ఉంటాయి. ముఖ్యంగా సమ్మర్ లో బాదంపాలు తాగితే ఆ మజానే వేరుగా ఉంటుంది. టేస్ట్ తో పాటు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా బాదంపాలు తాగేందుకు ఇష్టపడతారు. అయితే వేసవిలో స్పెషల్ గా ఇంట్లోనే టేస్టీ బాదంపాలు తయారు చేసుకోవచ్చు. అచ్చం బయట షాపులో తాగినట్టే ఉంటుంది. మరి ఈ టేస్టీ బాదంపాలు ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
బాదంపాలు తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. బాదం 15 నుంచి 20 తీసుకోవాలి, పాలు రెండు కప్పులు, చక్కెర రెండు టేబుల్ స్పూన్లు, యాలకులపొడి పావు టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు ఐదు లేదా ఆరు తాడులు, నీరు నానబెట్టుకోవాడానికి సరిపడా తీసుకోవాలి. ఇప్పుడు బాదంపాలు తయారీ విధానం చూస్తే.. ముందుగా బాదంను వేడి నీటిలో నానబెట్టాలి. 20 నుంచి 30 నిమిషాలు నానబెట్టిన తర్వాత తొక్కలు తీసేయాలి.

ఇప్పుడు నానబెట్టిన బాదంను కొద్దిగా పాలతో మిక్సీలో వేసి స్మూత్ గా పేస్ట్ గా చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత అందులో పాలు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆ పాలలో బాదం పేస్టు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అందులోనే చక్కెర, యాలకుల పొడి వేసి మిక్సింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలోనే కుంకుమ పువ్వును వేసి 5 నిమిషాల పాటు సిమ్ లో పెట్టుకోవాలి. ఆ తర్వాత వేడి వేడి గ్లాసులో బాదంపాలు పోసి సర్వ్ చేసుకోవడమే.. అయితే బాదంపాలను వేసవిలో చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications