ఆ పార్టీలోనే చేరుతున్నాను, జీవన్ రెడ్డి మరో ట్విస్ట్..!!
కాంగ్రెస్ మాజీ నేత జీవన్ రెడ్డి కీలక ప్రకటన చేసారు. తాను ఏ పార్టీలో చేరేది స్పష్టత ఇచ్చారు. కొంత కాలంగా సాగుతున్న సస్పెన్స్ కు తెర దించారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తరువాత పలు మార్లు అనుచరులు.. నియోజకవర్గ ముఖ్య నేతలతో చర్చలు చేసారు. ఇదే సమయంలో ప్రజలు ఆశించిన పాలన రాలేదని జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తన రాజకీయ భవిష్యత్.. అడుగుల పైన స్పష్టత ఇచ్చారు. దీంతో.. జీవన్ రెడ్డితో పాటుగా పెద్ద సంఖ్యలో అనుచర వర్గం సైతం ఆయన బాటలోనే నడిచేందుకు సిద్దం అవుతున్నారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనూహ్య నిర్ణయం ప్రకటించారు. కొంత కాలంగా జీవన్ రెడ్డి చేరే పార్టీ పైన చర్చ జరుగుతోంది. ఈ సమయంలో జీవన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. సీఎం రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రజలు ఆశించిన పాలన రాలేదని జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పాలన చూసిన తర్వాత కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీ బెటర్ అని.. రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ మెరుగైన నాయకుడని అభిప్రాయ పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ వల్లే సాధ్యమైందని గుర్తు చేశారు. దీని ద్వారా జీవన్ రెడ్డి ఇక కాంగ్రెస్ లక్ష్యంగా రాజకీయం చేసేందుకు సిద్దం అవుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ నుంచి మంచి ఆఫర్లు వచ్చాయి. దీంతో, కార్యకర్తలతో చర్చల సమయంలో వారి అభిప్రాయాలను సేకరించారు. చివరగా బీఆర్ఎస్ లో చేరనున్నట్లు జీవన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.

రేవంత్ పై గురి పెట్టిన జీవన్ రెడ్డి
ఏప్రిల్ 13న జగిత్యాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది. కేటీఆర్ ఈ రోజు జగిత్యాలలో జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలోకి అధికారికంగా ఆహ్వానించనున్నారు. ఇక, జీవన్ రెడ్డి సైతం అధికారికంగా తాను బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలన బాగుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలోనే బీఆర్‌ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుందని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతోందని విమర్శించారు. ఉద్యోగులు, నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. దీంతో.. ఈ నెల 27న జరిగే పార్టీ ప్లీనరీలో అధికారికంగా అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరే విధంగా చర్చలు చేస్తున్నారు. ఈ రోజు కేటీఆర్ తో చర్చల సమయంలో ముహూర్తం పైన స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications