నేను బట్టలు విప్పడానికి రాలేదు: విజయ్ దేవరకొండ హీరోయిన్ ఫైర్!
తమిళ నటి, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అభిరామి వెంకటాచలం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన సబ్‌స్క్రైబర్ల తీరుపై అభిరామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడటమే దీనికి కారణం. ఇన్‌స్టాగ్రామ్‌లో 'సబ్‌స్క్రిప్షన్ మోడల్' ద్వారా ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను షేర్ చేస్తున్న అభిరామికి కొంతమంది నెటిజన్ల నుంచి ఎదురైన వింత డిమాండ్లు ఆగ్రహాన్ని తెప్పించాయి. ఈ క్రమంలో అభిరామి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కామెంట్స్ నెట్టింట చర్చకు దారితీశాయి.
అసలు వివాదం ఏంటి?
అభిరామి వెంకటాచలం తన క్రియేటివిటీని, విభిన్నమైన ఫోటోషూట్లను అభిమానులతో పంచుకోవడానికి నెలకు రూ.399 చొప్పున సబ్‌స్క్రిప్షన్ ఫీజును నిర్ణయించారు. అయితే డబ్బులు చెల్లించాం కదా అని కొందరు సబ్‌స్క్రైబర్లు ఆమెను అసభ్యకరమైన ఫోటోలు, నగ్నత్వాన్ని ప్రదర్శించే చిత్రాలు కావాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఈ దారుణమైన ప్రవర్తనపై అభిరామి వెంకటాచలం స్పందిస్తూ.. "నేను ఇక్కడ బట్టలు విప్పడానికి రాలేదు. నాలోని కళను, క్రియేటివిటీని ఇష్టపడే వారికోసమే ఈ పేజీ. ఎవరైనా నగ్నత్వం కోసం ఇక్కడికి వచ్చి ఉంటే వెంటనే అన్‌సబ్‌స్క్రైబ్ చేసి వెళ్లిపోండి" అంటూ ఘాటుగా హెచ్చరించారు.

ఇది పోర్న్ సైట్ కాదు..
సబ్‌స్క్రైబర్ల డిమాండ్లపై అభిరామి వెంకటాచలం స్పందిస్తూ.. "నేనేమి పోస్ట్ చేయాలో నాకు ఎవరూ చెప్పనక్కర్లేదు. ఇదేదో పోర్న్ సైట్ కాదు. కేవలం నా సృజనాత్మకతను గౌరవించే వారికి మాత్రమే ఇక్కడ ఆహ్వానం ఉంటుంది" అని అభిరామి వెంకటాచలం స్పష్టం చేశారు. సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నంత మాత్రాన సెలబ్రిటీల వ్యక్తిత్వాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని అభిరామి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం అభిరామికి 700 మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
ఎవరీ అభిరామి వెంకటాచలం?
అభిరామి వెంకటాచలం ప్రధానంగా తమిళ చిత్ర పరిశ్రమలో సుపరిచితురాలు. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన అభిరామి.. 2017లో 'మిస్ తమిళనాడు' కిరీటాన్ని గెలుచుకుంది. 2018లో విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత అజిత్ నటించిన 'నెర్కొండ పార్వై', ఆర్. మాధవన్ 'రాకెట్రీ' వంటి విజయవంతమైన సినిమాల్లోనూ నటించింది.
బిగ్ బాస్ ద్వారా గుర్తింపు
కేవలం సినిమాలే కాకుండా బుల్లితెరపై కూడా అభిరామి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'బిగ్ బాస్ తమిళం'తో పాటు 'బిగ్ బాస్ అల్టిమేట్' షోలోనూ పాల్గొని ప్రేక్షకులను అలరించింది. అలాగే వెబ్ సిరీస్ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ఆమె 'నెరుంజి', 'ఆగస్ట్ 27' అనే రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తనపై వస్తున్న విమర్శలను, అసభ్యకర డిమాండ్లను ఏమాత్రం భయపడకుండా ధీటుగా ఎదుర్కోవడంతో ఆమెకు మద్దతు కూడా లభిస్తోంది.












Click it and Unblock the Notifications