బెస్ట్ యాక్టర్‌గా మరో అవార్డ్ అందుకున్న అక్కినేని హీరో..!

అక్కినేని ఫ్యామిలికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు టాలీవుడ్ కి ఒక మూల స్తంభం లాగా నిలిచి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకోగలిగారు. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున సైతం స్టార్ హీరోగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఇప్పుడు అదే బాటలో నాగ్ కుమారుడు నాగ చైతన్య సైతం దూసుకుపోతున్నారు. రీసెంట్ గానే 'తండేల్' సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఆయన.. తన కెరీర్‌లో మరో సువర్ణ అధ్యాయాన్ని రాసుకుంటున్నారు.

నటుడిగా తన ప్రతిభను మరింతగా నిరూపించుకుంటూ, పరిశ్రమలో తన స్థాయిని బలంగా నిలబెట్టుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ పురస్కారాలలో ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం ఆయన కెరీర్‌కు మరింత గౌరవాన్ని తెచ్చింది. ఇప్పుడు కూడా అలానే మరో ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకొని వార్తల్లో నిలిచారు. ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) ప్రకటించిన అవార్డుల్లో కూడా ఆయన ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. దీంతో ఈ వ్యవహారం టాలీవుడ్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.

akkkineni-naga-chaitanya-got-best-actor-award-for-thandel-at-indian-national-film-academy-awards-202

ముంబైలో ఈనెల 16న ఘనంగా జరగనున్న ఈ అవార్డు వేడుకలో దేశవ్యాప్తంగా పన్నెండు సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. భాషల వారీగా విజేతల జాబితా మీకోసం ప్రత్యేకంగా..

తెలుగు (Telugu)..

తెలుగులో 'ది గర్ల్ ఫ్రెండ్' చిత్రానికి రష్మిక మందన్న ఉత్తమ నటిగా నిలిచింది. అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఎంపిక కాగా, 'మిరాయ్' ఉత్తమ చిత్రంగా నిలిచింది. విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో కూడా 'మిరాయ్' అవార్డు అందుకుంది. ఇక ఉత్తమ తొలి దర్శకుడిగా రామ్ జగదీష్ ('కోర్టు' చిత్రం) ఎంపికయ్యారు. మాస్టర్ రేవంత్ ఉత్తమ హాస్య నటుడిగా అవార్డు అందుకోనున్నారు.

తమిళం (Tamil)..

తమిళ సినీ పరిశ్రమ నుంచి దుల్కర్ సల్మాన్ ఉత్తమ నటుడిగా ('కాంత' చిత్రం), సిమ్రాన్ ఉత్తమ నటిగా ('టూరిస్ట్ ఫ్యామిలీ') ఎంపికయ్యారు. మారి సెల్వరాజ్ ఉత్తమ దర్శకుడిగా నిలవగా, 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది.

కన్నడ (Kannada)..

కన్నడ పరిశ్రమలో 'కాంతార చాప్టర్ 1' చిత్రం ఆధిపత్యం చాటింది. ఈ చిత్రానికి గానూ రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. రుక్మిణి వసంత్ ఉత్తమ నటిగా నిలిచారు. అలాగే 'కాంతార' ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకుంది.

మలయాళం (Malayalam)..

మలయాళ సినీ పరిశ్రమలో నివిన్ పౌలీ ('సర్వమ్ మాయ') ఉత్తమ నటుడిగా ఎంపిక కాగా, కళ్యాణి ప్రియదర్శన్ ఉత్తమ నటిగా నిలిచింది. 'లోకా చాప్టర్ 1' ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకోగా, డొమినిక్ అరుణ్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు.

హిందీ (Hindi)..

హిందీ సినీ పరిశ్రమలో రణవీర్ సింగ్ ('ధురంధర్') ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. యామీ గౌతమ్ ధర్ ('హక్' చిత్రం) ఉత్తమ నటిగా నిలిచింది. 'ఛావా' ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకోగా, 'ధురంధర్' సినిమాకు ఆదిత్య ధర్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+