పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ??
సినీ ఇండస్ట్రీలో హీరో-హీరోయిన్ల మధ్య ఎఫైర్లు, రిలేషన్‌షిప్‌లపై రూమర్లు రావడం కొత్త విషయం కాదు. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఇలాంటి వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే దక్షిణాది సినీ పరిశ్రమల్లో కూడా కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు పెద్ద చర్చకు దారి తీస్తాయి. కొంతమంది నటీనటులు తమ వ్యక్తిగత జీవితాల గురించి బహిరంగంగానే మాట్లాడుతుండగా, మరికొంతమంది మాత్రం రూమర్ల వల్లే వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఒకప్పుడు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించిన హీరోయిన్ నిఖిత గురించి సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది.
నిఖిత 2002లో వచ్చిన "హాయ్" అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత ఆమెకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా 2003లో వచ్చిన "కళ్యాణ రాముడు" సినిమా మంచి విజయాన్ని సాధించడంతో నిఖితకు గుర్తింపు మరింత పెరిగింది. ఆ తర్వాత సంబరం, ఖుషీ ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, మహారాజశ్రీ వంటి సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. నిఖిత తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేసింది. ఆమె నటనకంటే అందం, గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే హీరోయిన్‌గా గుర్తింపు పొందింది.

ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీలో ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. అక్కడ పలువురు స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. ఇదే సమయంలో ఆమె కన్నడ స్టార్ నటుడు దర్శన్తో సన్నిహితంగా ఉన్నారనే వార్తలు బయటకు వచ్చాయి. అప్పటికే దర్శన్ వివాహితుడు కావడం వల్ల ఈ విషయం పెద్ద వివాదంగా మారింది. ఈ విషయం తెలిసిన దర్శన్ భార్య విజయలక్ష్మి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం పెద్ద చర్చకు దారి తీసింది. ఆ సమయంలో దర్శన్‌పై కేసు నమోదై ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కూడా వార్తలు వెలువడ్డాయి. ఈ వివాదం కారణంగా నిఖిత పేరు కూడా పెద్ద ఎత్తున మీడియాలో చర్చకు వచ్చింది.
ఈ ఘటన తర్వాత కన్నడ చిత్రసీమలో నిఖితపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అప్పట్లో కన్నడ ఫిల్మ్ చాంబర్ ఆమెపై తాత్కాలికంగా నిషేధం విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. అయినప్పటికీ ఆ వివాదం ఆమె కెరీర్‌పై ప్రభావం చూపిందని సినీ వర్గాలు భావించాయి. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన నిఖితకు తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి.
సినీ కెరీర్‌లో కొంతకాలం విరామం తీసుకున్న నిఖిత, 2017లో వ్యాపారవేత్త గగన్‌దీప్ సింగ్ మాగోను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత రాజసింహ అని ఒకే ఒక కన్నడ చిత్రంలో చివరిసారిగా కనిపించింది. తర్వాత మరే మూవీలోనూ కనిపించనేలేదు. దాదాపు ఆరేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. అయితే మధ్యలో.. కన్నడ బిగ్‌బాస్ మొదటి సీజన్‌లోనూ పాల్గొని రెండో రన్నరప్‌గా నిలిచింది. ఈమెకు ఓ కూతురు కూడా ఉంది. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన కుటుంబంతో తీసుకున్న ఫోటోలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటోంది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications