కర్కాటకరాశి వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారం.. అన్నింటా విజయం!
కర్కాటక రాశి జాతకులకు పరాభవ నామ సంవత్సరం అత్యంత శుభప్రదమైన సంవత్సరం. పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11 గా ఉంటుంది. రాజపూజ్యం 4, అవమానం 7గా ఉంటుంది. ధన, విద్యా, సంపద, బుద్ధి, సంతాన కారకుడు అయినటువంటి గురుడు కర్కాటక రాశిలో జన్మరాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశి జాతకులకు కష్టాలను అధిగమించే శక్తి లభిస్తుంది. ఊహించని అభివృద్ధి సాధ్యమవుతుంది.
ఆర్థిక స్థితి
కర్కాటక రాశి జాతకుల ఆర్థిక స్థితి ఈ సమయంలో బాగుంటుంది. ఈ సమయంలో కొత్త గృహాల నిర్మాణం చేసే అవకాశం ఉంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. విలువైన స్థలాలు కొనుగోలు, కాంట్రాక్ట్ రంగంలో ప్రయోజనాలు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి సాధ్యమవుతాయి. ఊహించని అభివృద్ధిని చూసే అవకాశం ఉంది.

ఉద్యోగులకు
కర్కాటక రాశి లోని ఉద్యోగులకు ఇది మంచి యోగ కాలంగా చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు, ఇంక్రిమెంట్లు సాధ్యమవుతాయి. తాత్కాలిక ఉద్యోగులు శాశ్వత ఉద్యోగాలను పొందుతారు. ప్రైవేట్ రంగంలో యజమానుల నుండి గుర్తింపు లభిస్తుంది.
వ్యాపారస్తులకు
వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. గతంలో కంటే అధిక లాభాలు వస్తాయి. కొత్త వ్యాపార ప్రారంభాలకు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో పెట్టుబడులు పెట్టేవారు లాభపడతారు. హోల్సేల్, రిటైల్ వ్యాపారులకు లాభాలు వస్తాయి. వ్యవసాయదారులకు కూడా కలిసి వస్తుంది. చేపలు, రొయ్యల చెరువుల యజమానులకు గతంతో పోలిస్తే కలిసి వస్తుంది.
విద్యార్థులకు
ఈ సంవత్సరం విద్యార్థులకు గురు బలంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. విద్య పైన ఆసక్తి కలుగుతుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. పోటీ పరీక్షలు రాసేవారు మంచి ర్యాంకులను సాధిస్తారు. క్రీడాకారులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది.
కుటుంబ జీవనం
కర్కాటక రాశి జాతకుల కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంతో ప్రశాంతంగా ఉంటారు. గతంలో వివాదాల కారణంగా విడిపోయిన దంపతులు తిరిగి కలిసి సంతోషంగా జీవిస్తారు. ఈ సంవత్సరం స్త్రీలు పట్టిందల్లా బంగారం అవుతుంది. కుటుంబంలో వారి మాటకు విలువ ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది. సంతానం వల్ల సంతోషం ఉంటుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications