ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..!
హీరోయిన్ సమీరారెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటించిన ఈమె ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగులో చేసింది తక్కువ చిత్రాలే అయినా.. సూపర్ క్రేజ్ సంపాదినంచుకుంది. ఎన్టీఆర్ హీరోగా నరసింహుడు మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈమె.. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకోగలిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో అశోక్.. చిరంజీవితో జై చిరంజీవా సినిమాల్లో నటించింది.
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె ముంబైకి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ వర్ధేని ప్రేమ వివాహం చేసుకుంది. సమీరా, అక్షయ్ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ లైఫ్ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. కాగా గతంలో ఎన్టీఆర్ - సమీరా రెడ్డి ప్రేమించుకున్నారని జోరుగా ప్రచారం నడిచింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ సైతం ఓ ఇంటర్య్వూలో అంగీకరించారు. అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలోని 'కలర్ డిస్క్రిమినేషన్' సహా బాడీ షేమింగ్‌పై నటి సమీరా రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సమీరా ఏమన్నారంటే..
తనను సినిమా పరిశ్రమలో ఉన్న తెల్లతోలు వ్యామోహం బాగా ఇబ్బంది పెట్టినట్టు చెప్పుకొచ్చింది. అసలు రంగు కంటే ఇంకా తెల్లగా కనిపించాలని.. ముఖానికే కాక ఎక్కడైతే బయటకు కనిపిస్తుందో అక్కడ శరీరానికి కూడా మేకప్ వేసుకోవాలని ఒత్తిడి చేసేవారని ఆమె తెలిపింది. అలా వాళ్లు చెప్పడం వల్ల, తాను అంత అందంగా ఉండనేమో అన్న భావన కలిగేదని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ఎత్తు తక్కువగా ఉండటం వల్ల లావుగా ఉందంటూ విమర్శలు చేసేవారని పేర్కొంది.
ఇక పెళ్లి తర్వాత మొదటి సంతానం అనంతరం.. 'పోస్ట్-పార్టమ్ వెయిట్ గైన్' వల్ల ఆమె తన ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది. కానీ రెండోసారి తల్లి అయినప్పుడు మాత్రం తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాను అని చెప్పుకొచ్చింది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా తెల్లబడిన తన జుట్టుని చూసి నెటిజన్లు దారుణమైన కామెంట్స్ చేసేవారని ఓపెన్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఈ నటి చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.












Click it and Unblock the Notifications