ఒక్కో కుటుంబానికి ఎకరం భూమి పంపిణీ చేస్తాం: కవిత

తెలంగాణ రక్షణ సేన(TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే పేదల కోసం భూలక్ష్మి పథకాన్ని తీసుకొస్తామని అన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలంటే మళ్లీ భూ పంపిణీ జరగాలి అని స్పష్టం చేశారు. అర్హులైన ఒక్కో కుటుంబానికి ఎకరం భూమి పంపిణీ చేస్తామని కవిత సంచలన హామీ ఇచ్చారు.

తెలంగాణ రక్షణ సేన(TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే పేదల కోసం భూలక్ష్మి పథకాన్ని తీసుకొస్తామని అన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలంటే మళ్లీ భూ పంపిణీ జరగాలి అని స్పష్టం చేశారు. అర్హులైన ఒక్కో కుటుంబానికి ఎకరం భూమి పంపిణీ చేస్తామని కవిత సంచలన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రేవంత్ రాక్షస రాజ్యం (ఆర్ ఆర్ ఆర్) నడుస్తోందని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు భూ దొంగలు అంటూ ఆమె ఫైర్ అయ్యారు. సామాజిక అన్యాయం అనాల్సిన ముఖ్యమంత్రి సామాజిక న్యాయం అంటున్నారని మండిపడ్డారు. ఆయనది సామాజిక న్యాయం కాదు ఆటవిక న్యాయం అని ఎద్దేవా చేశారు. 22ఏ ద్వారా ఈ ప్రభుత్వం భూ దొంగతనానికి రాచబాట వేసుకుంటోందని మండిపడ్డారు. పేదల భూములను పరిశ్రమల పేరుతో లాక్కుంటే ఊరుకోం వారి కోసం మేము కొట్లాడుతామని స్పష్టం చేశారు.

"మేము సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పెట్టిన తర్వాతే ముఖ్యమంత్రి సామాజిక న్యాయం గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. మా సభ తర్వాత కచ్చితంగా సామాజిక తెలంగాణ గురించి మాట్లాడే అనివార్యత వస్తుందని చెప్పాం. ఇప్పుడు అదే జరిగింది. 31 నెలలుగా మాట్లాడని ముఖ్యమంత్రి మా ఒత్తిడి కారణంగా సామాజిక న్యాయం అనే మాట మాట్లాడుతున్నారు. మేము తీసుకొచ్చిన అనివార్యత కారణంగానే అధికారంలో ఉన్న పార్టీ దిగివచ్చి సామాజిక న్యాయం అంటోంది. కానీ ముఖ్యమంత్రి సామాజిక అన్యాయం అనాల్సింది పోయి సామాజిక న్యాయం అన్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన చేసేదే సామాజిక అన్యాయం. కానీ సామాజిక న్యాయం అంటాడు. నిజంగా సామాజిక న్యాయంపై చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గంలో 16 మంది ఉంటే ముగ్గురు మాత్రమే బీసీలు ఉంటారా..?" అని కవిత ప్రశ్నించారు.

"ఏడుగురు మాత్రమే బీసీలు ఉన్నారు. అందరికీ మంత్రి పదవులు సాధ్యమా అంటే ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు కదా..? వాళ్లలో మీకు ఎవరు కూడా అర్హత ఉన్నవాళ్లలాగ కనిపించలేదా..? ఇద్దరు ఆడబిడ్డలకు మంత్రి పదవులు ఇచ్చామని చెబుతున్నారు. అది 33 శాతం అవుతుందా..? తెలంగాణ ఉద్యమకారురాలు విజయశాంతి ని ఎమ్మెల్సీ చేసి సైలెంట్ చేశారు. ఆమెకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు..? అందుకే ఈ ముఖ్యమంత్రి సామాజిక న్యాయం అంటే మనం నమ్మవద్దు. మేక వన్నె పులి మాదిరిగా ఆయన సామాజిక న్యాయం అంటున్నాడు. ఇటీవల అడ్వయిజరీ పదవులు వీహెచ్ గారికి, శివధర్ రెడ్డి గారికి ఇచ్చారు. కానీ వీహెచ్ గారికి చాలా తక్కువ జీతం, తక్కువ ర్యాంక్ ఇచ్చారు..?" అని కవిత స్పష్టం చేశారు.

" కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఉండి మేము చిన్ననాటి నుంచి కూడా రాజీవ్ గాంధీ జయంతి నిర్వహిస్తున్న వ్యక్తి వీహెచ్ గారు.ఆయనకు తక్కువ జీతం, తక్కువ ర్యాంక్ ఇచ్చారు. శివధర్ రెడ్డికి మాత్రం రెండున్నర లక్షల జీతం ఇచ్చారు. ఎందుకు వారిద్దరిలో అంత వ్యత్యాసం..? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఆర్టీఐ కమిషనర్లు ఇస్తే వారిలో ఒక్క బీసీ కూడా లేడు. పైగా ఆర్టీఐ కమిషనర్ భార్యను చిత్రపురి కాలనీ సోసైటీలో మెంబర్ ను చేశారు. చిత్రపురి కాలనీ వాళ్లకు న్యాయం చేస్తానని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఊదరగొట్టారు. 52 జడ్జిమెంట్లు ఉన్నా సరే వారికి న్యాయం చేయటం లేదు. సంబంధం లేని వాళ్లకు సోసైటీలో పదవులు ఇచ్చారు. ఎటు పక్క చూసిన సరే అగ్రకులాలకు చెందిన వారికే పదవులు ఇస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి మాట్లాడేది సామాజిక న్యాయం, కానీ చేసేది అటవీక న్యాయం. అడవిలో బలమైన జంతువుదే రాజ్యం. మనం అలా ఉండకూడదని సోసైటీగా ఉండాలని అనుకున్నాం. మాటల్లో కాకుండా చేతల్లో సామాజిక న్యాయం అనేది చేసి చూపాలి" అని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.

"గత రెండేళ్లలో 5 లక్షల 96 వేల కోట్ల బడ్జెట్ పెడితే బీసీల కోసం ఖర్చు చేసింది 5 వేల 5 వందల కోట్లే. అంటే ఒక్క శాతం మాత్రమే బీసీల కోసం ఖర్చు చేశారంటే ఎంత అన్యాయం. బీసీల జనాభా ఎంత..? మీరు ఖర్చు చేసింది ఎంత..? మహిళలపై కూడా మీకు గౌరవం లేదు. గాంధీ భవన్ లో ఎంతమంది మహిళలు పదవుల కోసం ధర్నా చేశారు..? ప్రియాంక గాంధీ పోటీ చేస్తే మీరంతా వెళ్లి గెలిపించుకుంటారు. కానీ మీనాక్షి నటరాజన్ ను మాత్రం ఈ ముఖ్యమంత్రే కుట్ర చేసి ఓడిస్తాడు. ఇదేనా మీరు చెప్పే సామాజిక న్యాయం, మాటల్లో కాదు చేతల్లో ఉండాలి. యాదగిరి గుట్టలో డిప్యూటీ సీఎం గారిని కింద కూర్చోబెట్టి అవమానించారు. ఎంపీ వంశీ గారికి కనీసం పుష్కరాల ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదు. బీసీ బిడ్డలు మంత్రి వాకిటి, కొండా సురేఖలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘోరంగా అవమానించారు.పొంగులేటి కన్నా సీనియర్ అయిన కొండా సురేఖను అవమానించలేదా..?" అని కవిత ప్రశ్నించారు.

"లంబాడాలు మినిస్టర్ గా లేని ఏకైక కేబినెట్ మీదే. మైనార్టీలకు కూడా రెండేళ్లు మంత్రి పదవి ఇవ్వలేదు. మేము పోరాటం చేస్తే ఈ మధ్యనే అజారుద్దీన్ కు పదవి ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీల నిధుల్లో 40 శాతం కూడా వారి కోసం ఖర్చు చేయటం లేదు. కాంగ్రెస్ పార్టీ తీసుకునే క్రమశిక్షణ చర్యల్లో కూడా బీసీలకు ఒక విధంగా, అగ్రకులాలకు ఒక విధంగా ఉంటాయి. రాష్ట్రంలో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనే పరిస్థితి పాలన జరుగుతోంది. పొంగులేటిని గెలిపిస్తే వాళ్ల కొడుకు, శ్రీధర్ బాబు ను గెలిపిస్తే వాళ్ల సోదరుడు, భట్టిని గెలిపిస్తే వాళ్ల కుటుంబ సభ్యులు ప్రజల మీద పడుతున్నారు. మొత్తం ఒక 2 వందల మంది ముఠా ప్రజల మీద పడి వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. ఇందిరమ్మ కాలంలో పేద ప్రజలకు ఇచ్చిన భూములను రాబందుల్లా లాక్కుంటున్నారు. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పేదల దగ్గర నుంచి 30 వేల ఎకరాల భూములను లాక్కున్నారు.

"మీరు పేదలకు భూములు ఇవ్వలేదు. పీవీ గారు ఇందిరాగాంధీని ఒప్పించి పేదలకు భూములు ఇచ్చారు. తెలంగాణలో నిజాం కొంతమంది పేదలకు భూములు ఇచ్చారు. వాటిని మీరు లాక్కుంటున్నారు. ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా అసైన్డ్ ల్యాండ్ లకు యాజమాన్యం హక్కులు ఇవ్వాలి. వికారాబాద్ లో పరిశ్రమల పేరుతో 80 శాతం అసైన్డ్ ల్యాండ్ లను తీసుకున్నారు. అందుకే ఈ భూ దోపిడీని నివారించేందుకు విప్లవాత్మకంగా పోరాటం చేద్దాం కలిసి రావాలని తెలంగాణ మేధావులను చేతులు జోడించి కోరుతున్నా. మనం రాష్ట్రం కావాలని పట్టుబట్టి పోరాటం చేస్తేనే సాధ్యమైంది. అలాగే సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలి. సామాజిక న్యాయం జరగాలంటే ఈ రాష్ట్రంలో మరొక్క మారు భూ పంపిణీ జరగాల్సిన అవసరం ఉంది" అని కవిత అన్నారు.

"రేవంత్ రెడ్డి కుటుంబానికి భూమి అంటే వ్యాపారం కావచ్చు. కానీ ఆదీవాసీలకు, పేదలకు, మధ్య తరగతి వాళ్ల కు భూమి అంటే పంచప్రాణం. అందుకే పేదలకు భూమి పంపిణీ జరగాల్సిందే. మానవత్వంతో కూడిన పాలన ఈ ప్రభుత్వంలో లోపించింది. అందరికీ సమానమైన అవకాశాలు కల్పించాలి. పేదలకు భూమి పంపిణీ చేయాలి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత భూ లక్ష్మి పేరుతో ప్రతి కుటుంబానికి ఎకరం భూమి పంచుతాం. సోషల్ జస్టిస్ జరగాలంటే.. మళ్లీ ల్యాండ్ రీ డిస్ట్రిబ్యూషన్ జరగాల్సిందే. మేము అధికారంలోకి వచ్చాక ఎకరం భూమి పంచుతాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే ఆ పనిచేయాలని డిమాండ్ చేస్తున్నాం. పేదల భూములను లాక్కుంటామంటే మాత్రం ఊరుకునేది లేదు. వారి తరఫున మేం పోరాటం చేస్తాం. సమాజంలో భూమి ఉందంటే ఉండే గౌరవం వేరు" అని కవిత పేర్కొన్నారు.

Kavitha TRS chief makes announcement promising to distribute one acre of land each eligible family

"సామాజిక న్యాయం జరగాలంటే ప్రజలకు కచ్చితంగా భూమి ఉండాల్సిందే. కుటుంబానికి ఎకరం భూమి పంచే అవకాశం ఉందన్న లెక్కలు చూసుకున్న తర్వాతే భూ లక్ష్మి పథకం గురించి మాట్లాడుతున్నా. ప్రభుత్వం వద్ద 60 లక్షల ఎకరాలు ఉంది. భూదాన్ భూములు కూడా ఉన్నాయి. భూదాన్ భూముల్లో దాదాపు లక్ష ఎకరాలు ఎక్కడకు పోయాయో లెక్క లేకుండా చేశారు. రాష్ట్రంలో కుటుంబానికి ఎకరం భూమి పంచేందుకు ఉంది. కానీ ప్రభుత్వాలకు మనసు లేదు. సీడ్ కంపెనీలకు బినామీ పేర్లతో వేలాది ఎకరాలు ఉన్నాయి. ప్రభుత్వం సిన్సియర్ గా ఆలోచిస్తే భూమి ఇవ్వవచ్చు. ధరణి, భూ భారతి అనేది రెండింటినీ మిస్ యూజ్ చేస్తున్నారు. 22ఏ అనేది ఈ ప్రభుత్వం భూ దొంగతనం చేసేందుకు వేసుకుంటున్న రాచబాట.." అని కవిత స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+