మరి కొద్ది గంటల్లో హైదరాబాద్ అల్లకల్లోలం.. జల్దీ ఇంటికి పోవాలంటూ ఆదేశాలు జారీ..!
హైదరాబాద్ లో మరికొద్ది గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలంగాణ వెథర్ మాన్ టీ బాలాజీ తాజాగా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. హైదరాబాద్ లోని దక్షిణ ప్రాంతాలతోపాటు శంషాబాద్ ఎయిర్ పోర్టు ఏరియాలో భారీ వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. బాలాపూర్, మామిడిపల్లి, పహాడీ షరీఫ్, శంషాబాద్, శివరామ్ పల్లి, బద్వేల్, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో కొద్ది గంటల్లో భారీ వర్షం కురుస్తుందని అంచనా వేశారు.

వెస్ట్ హైదరాబాద్ లో వర్షాలు శుక్రవారం సాయంత్రం 5 గంటల 50 నిమిషాలకు ముగిశాయి. వచ్చే గంటలో హైదరాబాద్ లోని దక్షిణ ప్రాంతంలో వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. అంతకుముందు ఇదే రోజు శేరిలింగంపల్లి, గచిబౌలి, కొండాపూర్, నానక్ రామ్ గూడ, మణికొండ, షేక్ పేట్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, మాధాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వర్షం పడినట్లు వెథర్ మ్యాన్ టీ బాలాజీ పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఉద్యోగులు, విద్యార్థులు, వాహనాదారులు త్వరగా తమ ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
HyderabadRains UPDATE 4 - 5.50 PM ⚠️🌧️
— Telangana Weatherman (@balaji25_t) October 3, 2026
Rains in West HYD comes to an end
Next scattered INTENSE RAINS across South Hyderabad towards Balapur, Mamidipalle, Pahadi sharif, Shamshabad, RGIA, Sivarampalle, Budvel, Rajendranagar and nearby areas in next 1hr ⚠️🌧️
హైదరాబాద్ నగరంతోపాటు రంగారెడ్డి, యాదాద్రి, జనగామ్, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాల్లో రానున్న రెండు గంటల్లో వర్షం పడే అవకాశం ఉందన్నారు. అయితే తెలంగాణలో ప్రస్తుతం వేడి, ఉక్కపోత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా అంచనా వేసింది. ఈ మేరకు నల్గొండ, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వరంగల్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో రాత్రి సమయంలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక మిగతా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
